Saturday, February 20, 2016

వీరా "భావవల్లరి" 2 అద్వితీయము


 గుడిపల్లి వీరారెడ్డి
ప్రభుత్వ ఉపాద్యాయులు



🌺🌺🌺🌺🌺

శివం
నీల కంఠుని వదలక నిత్య మెపుడు
మదిని తలచుచు నుండిన మంచి జరుగు
సత్య మెరిగియు వర్తిల్ల సంతసమ్ము
చిత్త లూరున నెలకొన్న చిద్విలాస
1
పుట్టె తిరుచూళి పట్టణం పుణ్య మేమొ
సుంద రలగమ్మల సుతుడై సుంద రముగ
భువిని కాల్మోపె రమణుడే  భూసు రుడుగ
భక్తి కర్థంబు తెలుపగా భవ్య ముగను
2
కలిసి దేహము తోనె తా కలిసి పోయి
ఇద్దరొకటన్న తలపోత ఇట్టు లయ్యె
క్షీణ అక్షీణ భావమ్ము క్షీణ మవ్వ
బంధ మనుగూడు లోతాను బంధి యయ్యె
3
నిన్ను తలవని రోజున నిజము గానె
ప్రియము గానేను శ్వాసను పీల్చ లేను
నిన్ను మరచిన క్షణమున నిజము గానె
నిలవ లేనులె భూమి పై నిక్కముగను
4
చావు పుట్టుక లన్నవి చక్క గాను
చేతిలో లేని విషయమే చెప్పగాను
నడుమ నున్నట్టి కాలమే నవ్వు కుంటు
జీవికను సాగ దీయుటే జీవితమ్ము
5
చావ వలసిన క్షణమొస్తె చచ్చి నట్టు
నీదు పాదాల చెంతనే నిక్క ముగను
నిలుతు నిను చేర హాయిగా నిజము సుమ్మి
పుట్టు చోటికి వెల్తున్న పులకరమున
6
సిగ్న లున్నను నియమాలు సితము వదలి
ఎగర జూచెడు వారికి ఎదురు నిలిచి
మందలించియు మార్గము నెఱుక పరచు
రక్షక భటులార మాపాలి రక్ష మీరు
7
నిమిష మాలస్య మాయెనా నీకు ఎపుడు
ఎందరున్నను ఫలమేమి ఎక్కడైన
రోడ్డు జామని అంతట రోదనేగ
రక్షక భటులార మాపాలి రక్ష మీరె
8
ప్రాణ మన్నది మీదేన ప్రాజ్ఞులార
ప్రాణముగ జూచు మీ పాలి ప్రాణు లెన్ని
ఎదురు జూచుచు నున్నారొ ఎఱుగ లేవ
ఎందుకావేగ మెందుకు ఎందు కొఱకు
9
నాల్గు దిక్కులు వదలక నవ్య మేది
ఎరుగ లేవేమి రోజంత ,ఎంత మాత్ర
మీవు విశ్రాంతి తెలియని విజయు డవగ
తిన్న గుందువు నీ కేమి తెలియ నట్లు
10
మనసు గెలవగ కోరుకో మనిషి లాగ
మనిషి నే గెల్వ కోరకు మనసు లేక
మనిషి మనసుల బంధమే మమత యౌను
వినర గుడిపల్లి మాటను వివర మెఱుగ
11
పరుల మనసును గెలుచుట పాడి గాని
తప్పు లెంచుట ఎప్పుడు తగదు చూడ
తప్పు లెంచెడి గుణమున్న తప్ప కుండ
ఒరుల బాధించి సాధించి ఓడిపోవు
12
తెలిసి అడుగుట తప్పని తెలియలేవ
తప్పు లెంచుట లో తృప్తి తప్పు కాద
ఎదుటి వారిని నొప్పించ ఎపుడు గూడ
సాహసించకు సోదరా సత్య మరసి
13
మంచి చెడు లేమిటో చెప్పు మంచి మనసు
మంచి మనసేమిటో చెప్పు మంచి చెడులు
మంచి చెడులెెంచు వారెపో మందమతులు
సహజ గుణమది వీరన్న సాగ నివ్వు
14
పరుల పొగడకున్న పాపిష్టి నోరండ్రు
ఒట్టి మాట కాదు ఒప్పు జూడ
పొగడ నెఱుగ కున్న పోగాల మంతేగ
పలుకులు గుడిపల్లి పలికె నిట్లు
15

సీస పద్యం

భాగ్య నగర ప్రజ భావి నేతగ నీకు
              భద్ర మైన గెలుపు భాగ్య మిచ్చె

ఎదురు లేక గులాబి ఎన్నికల్లో గెల్చి
               గతమున లేనట్టి ఘనత దెచ్చె

భారీ మెజారిటీ భాగ్యము నీదవ్వ
                ఓటరందరి నేమొ ఓడగొట్టె

అంబర మంటేను ఆనందమే నేడు
                అందరి హృదయాలు అద్భుతముగ

ఆ.వె

వేరు రాష్ట్ర మున్న వెతలుండ వనిజెప్పి
మనకు రాష్ట్ర మొచ్చు మార్గ మందు
నడిపి తెచ్చి నావు నవ్య రాష్ట్రమ్మేను
జనత మెచ్చి నట్టి జన్మ నీది
16
ఆ.వె

నమ్మి నోల్ల నెపుడు నట్టేట ముంచలే
మరవ లేదు నీదు మాట నెపుడు
కోత లెరుగ మెపుడు కోరినట్టి కరెంటు
భాగ్య నగరి నేలు భాగ్య దాత
17
కం.ఏ పిలుపూ కదిలించని
ఈ పిలుపున దాగె నేమొ ఈప్సిత మేదో?
నీ పిలుపే మేలు కొలుపు
ఆ పిలుపే నాకు నేడు అందెను శంభో!!
18 
కం.తొలి పొద్దు పొడుపు ముడతలు
మలి పొద్దు సొగసు విరుపులు మరువగ తరమా?
వలిమల పైనే కాదుర 
కలగంటి తనపెదవొంపు కదలిక రూపున్
19
కొండ శిఖరాన ఒక మఱ్ఱి కొమ్మ పైన
సిద్ద రూపము థరించి సిధ్దు డిగను
అరుణ శివుడుండు ననినమ్మి అతను కదలి
కంది రీగల దాడిలో కంది పోయె
20
కంది రీగల గూల్లను కాల్లతోటి
తాకి కూల్చిన ఫలితమ్ము తాను నమ్మి
కోరె క్షమాపణలు వాటి కోప మెరిగి
పోవ తానింక వెనుదిర్గి పోయె గాద
21
మళ్ళ జన్మంటు ఉండునా? మల్లి పుట్ట?
సాధ్య మగునని నమ్మడం సత్య మేన?
రమణ సారమ్ము తెలిపిన రమ్య బోధ
అదియు అజ్ఞాన మన్నదే అతని మాట
22 
అన్ని తెలిసిన వాడెవ్వ రవని మీద
ఏమి తెలియని వాడెవ్వ డెచట గలడు
తెలిసి తెలియని వారేగ తెలివి జూప
వాగు తుందురు వీరన్న వాగ నివ్వు
23
సీ.
సీసము రాయగ శ్రీఘ్రము గా నేను
              గణ యతు లన్నింటి గణన నేర్చి
విరిసినట్టి గులాబి విరగబూ సినరీతి
             పాద పాద మునందు పంచ గాను
సంబరాలను జూసి సంతసించిన వారు
               పద్య పాదములను పాడు కుంటు
ఒప్పు కోలుగ జూసి ఒప్పారు సంతోష
                సంబరమ్ముకు నేను సంత సిస్తి
ఆ.వె
దీక్ష పట్టి సాగి దీక్షగా సాధించి
యజ్ఞ యాగ ములను యాగి చేయ
మాట జార కుండ మంచిజేసి యు జూపె
రాష్ట్ర ప్రగతి కొఱకు రాజ సముగ
24

ఇమడలే మనితెల్సి ఇంటివా డవలేని
             ఇక్కట్లు భరియించి ఈద గాను
కల్కటే రుకొలువు కాదుగా వదిలేసి
               తనకు నచ్చినరీతి తాను మెలగ
వలదన్న రాలేక వదల వదేలనో
                లాభమే లేకున్న లాస్య మేల?
చేయ పనులులేవ చేవగల్గిననీకు
               నిందనేల పరుల నింద సేయ

ఎవరు నిన్ను పిలిచి ఏమని అడిగారు
నీకు నీవె చేరు నిజము గాద
ప్రతి పనికి మనము ప్రభుతను నిందించ 
పాటి యేన మీకు ప్రశ్న వేయ
25
పద్య మన్నది వదిలి పంతులన్నది మర్చి
                    కవితనొదిలి నేను కలత చెంది
మాటమరిచి పోయి మారాము చేయక
                     మందలింపెరుగని  మనిషి నైతి
ఉద్యమ గీతాలు ఉధృతముగ రాసి
                    రాష్ట్ర మేర్పడగానె రాత లాపి
ఊరుకున్నపుడేమొ ఉచిత హైకని జెప్పి
                    కృష్ణ మోహను డొచ్చిగ్రూపు నిచ్చె

మంచి మితృలనిచ్చిన మంచి మనిషి
మధుర మైనది జీవితం మళ్లి మొదలు
కవిత ఝల్లులు మొదలాయె కళలు మారె
నిత్య కళ్యాణ మైపాయె. నిజము సుమ్మి
26
వరుస గలిపి మాట వదిలేటి ఇందిర
                కవిమితృ లందరి కామె అక్క
అన్న పానీయాలు అన్నియు వదిలేసి
                  కవితలు రాసేటి కవియె ఏ.వి
అరుణ భ్రమర లన్న అభిమాన మేకద
                  ఎవరికైన నిటను ఎంత గానొ
అమరవాది యు నేడు అందరి కభిమాన
                    పాతృడైన కవియు పాటి గాను

సల్ల అంబటి అంజన్న సల్ల గుండ
మేక రవి వాసిరెడ్డి ల  వాసి యొప్ప
కృష్ణ మోహన్ కళా చందృ కృప తోడ
సంక ట ములేక సాగెడు సైని కులము
27

భూమికి గాయాలు భూరిగ జేశారు
                   బోరు బా వులపేర పోట్లు పొడిచి
లోతుల్ల నీరంత లోపాల మయమాయె
                   ఫ్లోటింగు లేదాయె ఫ్లోరి నుండె
వనము లన్ని నరికి వర్షమ్ము లేకుండె
                   చెఱువు లెండగనేమొ చేటు వచ్చె
కఱువు కాటకముల కాలమా సన్నమై
                   కలియుగమ్మను పేర కాటు వేసె

సహజ సిద్దాంత మొదిలేసి సాగు తున్న
మానవాళికి లేదు మనుగ డింక
ఆశకే హద్దు లున్నచో అనవరతము
ప్రకృతి నియమాలు పాటించ ప్రాభవమ్ము
28

కోపమెందు కరుణ కొత్త మాటది చూడ
                 ఆప్త మితృలు మీరు అంద రున్ను
కవి మితృలందరు కాద ఆత్మీయులు
                  కవనమల్ల కలత ,కలత జెందు
అబ్బురమ్ము మనకు అంత కలిసి యుండ
                   ఎందుకు కోపాలు ఎవరి కొఱకు
ఎందరున్నను కాని ఏమి జేసిన గాని
                మీతోటి స్నేహమే మేధ మగిడి

కవన మల్లెడు మనమంత గర్వ పడగ
కలిసి నట్టిది ఈ గ్రూపు కడలి లాగ
కలుపు కొని నిల్చు కడదాక కల్ల గాదు
వదిలి పోనెప్పు డీ గ్రూపు వదల లేను
29
ఒక్క పూట బడులు ఒద్దందు రదియేల
                    పసివారి శిక్షించ పాడి గాదు
తల్లడిల్లుదురయ్య తప్పదు ఎండలో
                     వడలి పోదురు కాద బాల లంత
పంతుల్ల కేమైన పనిచెప్ప జూసిన
                    పాడియగును కొంత ఫలిత ముండు
పసిపిల్ల లేకదా పంతమేల మనకు
                  బలవంతముగ నేల బడులు నడుప

చిన్న పిల్లలు ఎండలో చిక్కి పోయి
తల్ల డిల్లుదురుకాద తథ్య ముగను
మొదలు పెట్టిరి మనవారు మొదటి నుండి
ఒక్క పూటే బడి నడుప ఒద్దికనియు
30
పది మంది లోనున్న పరిమళించెడి వాడు
                  ముద్ద మందారాల ముద్దు ఱేడు
వరుకోలు పిలగాడు వరుసగా స్పందించు
                 వదలక నెవరిని వద్దికగను
కవిత లల్లెడు వారి కవనమ్ము పరికించి
               విలువైన సలహాలు విశద పరచు
తను కళా చంద్రుడు తలపైన టోపితో
          సతతము చిరునవ్వు చిందు చుండు

ఎవరి నెపుడు బాధించి ఎఱుగనట్టి
శాంతరూపి కళా చంద్ర శాంతముగను
అందుకో శుభకామన లందు కొమ్ము
పుట్టిన దినము ఈనాడు పూర్ణ చంద్ర
31
అక్క చెల్లెలనగ అలక పూనగ వలె
           ఆడపడుచులన్న అలగ వలెను
ఓదార్చ బూనెడు ఓర్పు కలిగినోల్లు
           అన్నదమ్ము లుకాద! అవని మీద
బ్రతిమి లాడుట యన్న బ్రతుకులో సుఖమురా
             అందాల బంధమ్ము అదియె లెమ్ము
మాట పట్టింపు తో మాటాడ కుండిన
             తోబుట్టు కన్నీరు తూడ్చు నెవరు?

అలక లోదార్పు లెరుగని అడ్డ మైన
బ్రతుకు బ్రతుకగ సుఖమేమి భ్రాంతి గాని
చెల్లి అలుకను తీర్చని చేత గాని
అన్న గా జీవితము నేను ఆశ పడను
32

బ్రతుకు తదుపరి తా బ్రతుకగ వచ్చును
          మరు జన్మ కాకున్న మంచి పనియె
తననింక దానమ్ము  తానె చేసు కొనెడు
           భాగ్యమ్ము కలిగెను భాసు రముగ
అన్న దానము కన్న అవయవ దానమే
             మిన్న యై వెలుగొందు మింటి సాక్షి
శిబి రాజు మించిన శిబి చక్రవర్తులై
            ధరణి పై వెలుగొందు ధర్మ మిదియె

ఒడలు కోసియు ఒరులకు ఒసిగి బ్రతుకు
దాన గుణమున్న మనుజుల ధరణి మనది
వినుము గుడిపల్లి కవనమ్ము వీను లార
చిత్త లూరున నెలకొన్న చిద్విలాస
33
ఎన్ని నేర్పినవమ్మ ఎన్ని చెప్పి నవమ్మ
           ఎంత చెప్పిన కూడ ఎక్కువవదు
ఒంటరి తనమన్న ఒట్టి మాటే యౌను
           చేత నీ వున్నచో చేతనమ్ము
పుస్తకమవ్నచో పూర్ణ జ్ఞానము సుమీ
             మస్త కమ్మునకది మంచి మేత
నీ వున్న చాలమ్మ నీ కంటె నా కేమి
              ఎక్కువ కాదమ్మ ఎప్పు డైన

పుస్తకము నొదిలి బ్రతుక పూర్ణ సుఖము
పొంద లేమది నిజము లే పొందికగను
వినుము గుడిపల్లి కవనమ్ము వీను లార
చిత్త లూరున నెలకొన్న చిద్విలాస
34
తనసీటు లోగూడ తాను కూర్చోబోని
                  బస్సు కండక్టరు బాధ లేమి?
అడుగు నంతవరకు ఆలకించరు చూడ
                      కోరి టికెటడగ కోపమొచ్చు
వెనక కెల్లమనిన వెఱ్ఱి కోపము వచ్చు
                     బాటలో నిలబడి బాధ పెట్టు
సగము టి కెటుఅంటు సర్దిజెప్ప గనుజూచు
              వయసు తక్కు వజెప్పు వంక బెట్టు

మహిళ నిలబడ్డ చూతురు మారు మాట
పలక బోరు ,కండక్టరు పలుక రించ
వెతల బతుకాయె మాటల వేల మాయె
బస్సు కండక్టరంటెనే బాధలాయె
35
కోర నీకు కఱువ కోర్కెలు దీర్చగ
               కొబ్బరి చిప్పల గోల ఏల
నైవేద్య ములు ఏల? నైక శృంగా నీకు
          న్యాయమా లంచమ్ము నాశ పడగ
ఫలిత మాశించు యు ఫలమును ఇచ్చేటి
               ఖల దూర నీకెట్లు ఖ్యాతి వచ్చె
ఏలనే ప్రార్ధించి ఎందు కడగ వలె
             ఏమి కావలె నాకు ఎరుగ లేవ?

సకల సౌభాగ్యముల నివ్వ శాంతి నివ్వ
పూజ లవసరమన్న ఈ పుడమి నవ్వు
వినుము గుడిపల్లి కవనమ్ము వీను లార
చిత్త లూరున నెలకొన్న చిద్విలాస
36
బస్సు నిండుగ జనమున్న భయము లేక
వెనుక కెనుకకు నెట్టేసి వేగి రమ్ము
టికెటు ఇచ్చేసి యస్సారు డ్యూటి చేయు
బస్సు కండక్టరంటేను భక్తి నాకు
37
విన్న వినకున్న నవ్వుతూ విసుగు పడక
బస్సు నింపెడు డ్యూటీని భార మనక
ఆప మన్నంత నే బస్సు ఆపు నట్టి
బస్సు కండక్టరంటేను భక్తి నాకు
38
చిన్న టికెటుకు నోటివ్వ చిల్ల రిచ్చు
తాను నిలబడి సీటిచ్చు తల్లులకును
విసుగు చెందక నవ్వెడు విషయ మున్న
బస్సు కండక్టరంటేను భక్తి నాకు
39
పద్మ మరణించి నప్పుడు...13.02.2016

రామ బుద్ధుని ఇంట రాజిల్లె పత్నిగా
         పద్మ యనెడు పేర పరమ సాధ్వి
సాగెను దాంపత్య సౌరభమ్మే నాడు
           ఒడుదొడుకులు లేక ఒక్క తీరు
ఆలు మగలనిన అట్లుండ వలెనని
           అందరనుకొనగ అనవ రతము
కన్ను కుట్టిన విథియె కనుమరుగేచేసె
         పద్మను తన వెంట పట్టు కెల్లి

ఎప్పు డనికాదు చెప్పలే మెవరి కైన
ఎదురు కానున్న ఘటనయె యేల బాధ
ఒంటరైనట్టి రామన్న ఓర్చు కొమ్ము
వెంట మేమంత ఉన్నాము వెతలు మాన్ప
40
భ్రమర నాదమ్ము వినగాను భ్రమసె నేమొ
చెట్టు పుట్టలు సహితము చెప్ప గాను
ఆది వారము పిలిచెను ఆమె నవియు
ఫాము హౌజులో కొలువయ్యి ఫలము బొంద
41
కొత్త కవితలు వనములో కొదవ లేక
కోట్ల కొలదిగ లభియించు కోర్కె దీర
శారదాంబకు లోటేమి శ్రావ్యమైన
కంఠ స్వరము! . తోడుగా..కవిత లల్లు
42
                   డ్రైవర్(14.02.2016)

పయన మాతని దినచర్య పట్టు విడక
పొద్దు కెనిమిది గంటలు పోరు జేయు
ఆలు పిల్లలు ఇంటిలో ఆతురతగ
ఎదురు చూతురు తనరాక కెంత గానొ
43
బస్సు లోనున్న జనమంత భయము లేక
నిన్ను నమ్మియు నిదురోవు నిక్కముగను
మనసు లో వారు హాయిగా మరచి పోక
చేర గమ్యంబు మ్రొక్కేను చేత
43
బస్సు లోనున్న జనమంత భయము లేక
నిన్ను నమ్మియు నిదురోవు నిక్కముగను
మనసు లో వారు హాయిగా మరచి పోక
చేర గమ్యంబు మ్రొక్కేను చేతు లెత్తి
44
ఆ.వె
బస్సు చక్ర మనగ భవిత నీకిచ్చెడు
భవ్య చక్ర మదియు భాగ్య దాత
పయన మన్న నీకు భారమవ దెపుడు
నిత్య కృత్య మాయె నిక్క ముగను
45
బస్సు చక్రము ప్రగతికి మార్గ మన్న
ప్రగతి నీవల్లె సాధ్యము ప్రతిన జేతు
డ్రైవరనువాడు జనులను డ్రైవు చేయు
నాయకుని కంటె ఘనుడని నాదు మాట
46
పార్థసారథి గారి జన్మదిన కందాలు
(14.02.2016)
[2/14, 9:02 PM] వీరా గుడిపల్లి: [2/14, 8:54 PM] వీరా గుడిపల్లి: 
నాయుడు గారూ దండం
నాయుడు గారూ నిజమది నాయకులేలే
నాయుడు వనముల ప్రియులే
నాయకు లేగద జగతికి నమ్మర వీరా
47
వనము ల దహించ లేదే!
వనమిత్రుడివీవు నిజము వక్కా ణించన్
వన రక్షకుడి గ నీవే
వనదహనుడు పార్థుమించు వాడివి సుమ్మీ
48
[2/14, 9:01 PM] వీరా గుడిపల్లి: పార్థసారథి నాయుడు గారికి జన్మదిన శుభాకాంక్షలు
[2/14, 9:10 PM] వీరా గుడిపల్లి: 
సారథి నీ నామ మైనది
సారము నీ మది న నింకి సఫలం బాయెన్
సారథి పార్థును గాయగ
సారమె రిగివన ముగాచె సారథి శంభో
49
[2/14, 9:13 PM] వీరా గుడిపల్లి: పార్థసారథి నాయుడు గారికి అమకితమీ...ఆశువులు

మూసీ....నది(15.02.2016)

ఈదులాడిన తాను ఈప్సిత మీడేర
       మూసి యావల నున్న ముగ్ద గలిసె
కాలు బెట్టగలేని కాలుష్య భూతమ్ము
         కబళించె మూసీని కదర నేడు
బంగారు మనసున్న భాగమతియు నాడు
           ముచికుంద అందాల మురిసిపోయె
పట్న వాసపు నీడ పడగక్రిందీనాడు
         మురికి కూపమ్మాయె మూసి యంత

ప్రేమ తీరాల అలరారి ప్రేమ పంచి
భాగ్య నగరమ్ము పేరుతో భాగ్యమిచ్చి
మనిషి మరుగుజ్జు కోర్కెల మంట కలిసి
మూసు కొని పోయె "నాళా" గ మూసి నేడు
50
భాను తేజుడు అడిగిన భాగ్యమేమొ?
గుండె నిండుగ నిండిన గుబులు నంత
హైదరాబాదు కథలాగ హైకు లోన
తల్చుకోగల్గు చున్నాను తన్మ యమున
51
Family outing
వారాంత ములలోన వాత్సల్య ములబెంచ
           అందరొక్కటి అయ్యి అటకునటకు
తీరికగానుండి తీరుబాటుగ వెల్లి
               మనవారి తోడనే మాటగల్ప
పతియు పిల్లలునంత ప్రత్యక్షముగ గల్సి
             ఊసులు కలబోయ ఊరడిల్ల
మనసులెంతొ మురియు మాత్సర్యములు తగ్గు
               బందము బలపడి బాధ తొలగు

కలసి యుండుట లోననే కలదు సుఖము
ఒకరికొకరుగ తోడున్న ఓర్పు పెరుగు
వారమునకొక్కసారైన వదలకుండ
కలిసి ఉండాలి రోజంత కలత లొదిలి
52
శివం
నీల కంఠుని వదలక నిత్య మెపుడు
మదిని తలచుచు నుండిన మంచి జరుగు
సత్య మెరిగియు వర్తిల్ల సంతసమ్ము
చిత్త లూరున నెలకొన్న చిద్విలాస
53
విశ్వ మంతయు గోళమే విబుధులార
గోళమే లింగ రూపమ్ము గోప్యమేల?
శివుని రూపమే విశ్వమ్ము చిత్ర ముగను
చిత్త లూరున నెలకొన్న చిద్విలాస
54
నిత్య రక్షణ నీవన్న నిజము మరచి
అన్య మార్గాలు వెతికేటి అల్పు లంత
చిత్త మందున నిను గొల్వ చింతలేల?
చిత్త లూరున నెలకొన్న చిద్విలాస
55
అత్తమ్మ

అత్త యనిన నాకు అత్యంత గౌరవం
ఆలి నిచ్చి నట్టి ఆప్తు రాలు
అమ్మ వంటి దమ్మ. అత్తమ్మ అని యన్న
తప్పు కాదు ఎపుడు తనకు మొక్క
56
భాను గారి నడుగు బహుబాగ చెప్పేను
అత్త ఐన లేక అమ్మ ఐన
భాను తేజు కలము బలమైన పదునుతో
సాగు తుంది చూడు సాటి లేక
57
అత్త కాదు తాను అమ్మన్నదేనిజం
పెద్ద కొడుకు వలెను ప్రేమ జూపు
అంత గౌర వంబు ఆమెకు మనమివ్వ
తప్పు కాదు వీర! తరచి చూడ
58
అత్త కొక్క రోజు అన్యాయ మంటాను
అన్ని తానై నిలిచి ఆదరించు
మాతృ మూర్తి నెపుడు మర్యాద చేయుట
తప్పు కాదు వీర! తరచి చూడ
59
ఆమె

కలము పట్టి నేను కలలు కనెడు వేళ
కనుల ముందర తాను కన్పించు నేమి?
మనసు తనవెంట పరుగెత్తు మర్మ మేమొ
వినదు గుడిపల్లి మాటను విస్మ యముగ
60
ఆమె నవ్విన చాలుగా ఆస్తు లేల?
ఆమె చూసిన చాలుగా అన్య మేల!
ఆమె కనుచూపు సోకిన ఆంక్షలొదులు
వినదు గుడిపల్లి మాటను విస్మ యముగ
61
సూర్యుడు(16.02.2016)

వెలుగును ఇచ్చెడి వేల్పునాదిత్యుడే
                ఆకాశమందుండి అవని పైకి
నిలువెల్ల గాలుచు నిత్యమూ దగ్దమై
                ధరణి జీవంబైన దాతతాను
నిత్య సంచారిగా నిలకడ లేనట్టి
             కాలగణనలవెన్క కారణమ్ము
సప్త వర్ణపు కాంతి సతతము విరజిమ్ము
              సప్తాశ్వ రథమందు సంచరించు

అలుపు లేకుండ తిరుగుతూ అవని యంత
వెలుగు రేఖలు పరచెడి వేేల్పు తాను
వినుము గుడిపల్లి మాటను వీను లార
చిత్త లూరున నెలకొన్న చిద్విలాస
62
చిన్నెలు తెలియగ వశమా!
వన్నెలు పలు పలు విధములు వర్ణించంగన్
వెన్నెల చంద్రుని కిచ్చియు
ఇన్నెల ఇలకిచ్చి నట్టి ఇనుడిగ శంభో!!
63
రాశులు పన్నెండు రాసిన ధర్మంబు
           ఆకసంబున తాను అనవరతము
కక్ష్య వీడని వాడు కాలు నిలుపలేడు
            సమవర్తి అతనేగ సమయ ఱేడు
సప్త వర్ణములను సమ్మిళితముచేసి
            ధవళ కాంతిని తాను ధరణి పైకి
ప్రసరించి గాయును ప్రాణుల నెప్పుడు
             పట్టింపు లెరుగని పరమ స్రష్ట

చలన మాపని ధర్మంబు చలనశీలి
అగ్ని గోళంబు ! ధరణికి అంతతానె
వినుము గుడిపల్లి కవనమ్ము వీను లార
చిత్త లూరున నెలకొన్న చిద్విలాస
64
మూర్తి birthday(17.02.2016)

లెక్క లేతప్ప అన్యమ్ము లెక్క లేని
గణిత గగనాన వెలుగొందు ఘనుడొకండు
పుడమి పై మూర్తి యనుపేర పుట్టినాడు
వినుము గుడిపల్లి కవనమ్ము వీను లార
65
కొత్త లెక్క లెన్నొ కొత్తగా సృష్టించి
గణిత విలువ పెంచె ఘనము గాను
చిక్కు లెన్ని యున్న చింత లేకను తాను
తర్క మెఱుక సేయు తప్పు లేక
66
                   మేడారం.  (17.02.2016)

కాకతీయుల తోని కదనమ్ము సల్పియు
         మన్య వీరులుగాను మమత పంచి
సామంత ప్రభువుల సత్తాను ఎలుగెత్తి
          చాటిన ధీమంత చతురతదియు
జనము లోనే పుట్టి జనముకై జీవించి
          జనతనే దీవించ జగము లోన
వనదేవతలుగాను వనమందు వెలిసెను
          సమ్మక్క తోడుగా సారళమ్మ

పన్ను కట్టగ లేకను పస్తు లున్న
పట్టనటువంటి ప్రభువుల పట్టి కూల్చ
తల్లు లిద్దరు పడినట్టి తపన చూడు
చిత్త లూరున నెలకొన్న చిద్విలాస
67
అగ్ని గోళము బ్రద్దలై ఐచ్చికముగ
విస్త రించెను విశ్వమే విబుధు లార
విశ్వ మంతయు ఒకటన్న వింత కాదు
తప్పు చెప్పడు వీరన్న తరచి చూడ
68
సాగర మధనంబు సమయాన చంద్రుడు
                లక్షణముగ  బుట్ట లక్ష్మి తోడ
తల్లి తోబుట్టువు తనమేన మామని
              విశ్వ మానవ జాతి విశ్వ సించె
మేఘాల తేరుపై మేనమామైవచ్చి
           మానవాళికి మేలు మమత పంచె
అందరి బంధువై అలరారు చంద్రుడు
            వెలుగు దారుల జూపు వెన్నె లిచ్చె

రాత్రి వేళల మనకు రక్షణివ్వ
నింగి నున్నాడు చుక్కల నీడలోన
వెలుగు దారులు చూపించ వెలుగు చున్న
చందమామయ్య మనమామ చక్కనయ్య
69
కన్న పేగు తుంచ కఠినమైన మనసు
కాదు కాదు కాదు కాదు నాది
మోస గించ పడితి మోసకారినొదలి
నన్ను నింద సేయ ఏలవేర!!
70
గ్లాసు చాయ గత్కి గ్లాసును పడవేసి
పడతి నొదలి ఫోను పట్టు కొనియు
గంట గంట అంటు గంటలు గడపగ
జ్యోతి మౌన మయ్యె జ్యోతి కృష్ణ
71
బడిని గుడిగ మలచి బహుచక్కగానీవు
కవిత నల్లి నావు కాద నేడు
వంద కవిత లల్లి వందన మర్పించె 
బ్రతుకు విలువ తెలిపె భ్రమర కవిత
72
పద్య మరసి తాను పరిపరి విధముల
కథలు చెప్ప బట్టె కవన మల్లె
భార్య భర్త లట్ల భాగ్యము గా నున్న
మనము కవిత లల్లు మాట కల్ల
73. 
(సెల్ ఫోన్.19.02.2016)

శాస్త్ర మిచ్చిన గొప్ప శస్త్రము కదనీకు
           దూరాలు తగ్గించు దూర శ్రవణి
సాగదీయకు నీవు సైలెంటు కిల్లరే
          సెల్లు ఫోనన్నది సెప్ప తరమె
ఇల్లొల్లు గుల్లగు ఇంగితమును లేక
         ఇష్టమొచ్చినట్టు ఇగురు బెట్ట
అఖిల విశ్వమునంత అర చేత చూపించు
           మాయదర్పణ మది మంచిగున్న

రాముడెరుగడయ్య రాయలెరుగడయ్య
వారి కాల మందు వాస్తవముగ
మనకు కలిగె భాగ్య మానందముగనింక
వినుముర గుడిపల్లి వివర మిచ్చె
74
నోకియా స్యామ్సంగు నోటిఫై చేయగా
            సెల్కాను ఫోనులు సెటిలు ఆయె
అందకుండానుండె ఆపిలు ధరలేమొ
              ఐపాడు ట్యాబులు అదర గొట్టె
మోటుకాదుర వాడ మోటరోలా ఫోను
             మోటుగా వాడినా మోద మేను
కంపనీ ఏదైన కవిమిత్రు లందరూ
             హైకు వాట్సపు లుంటె హాయి పొందు

విశ్వ మంత ఒక్క విలువైన గ్రామమై
చెంత నున్న తీరు చెలగు చుండె
సెల్లు ఫోను తోనె సేదదీరుచు నుండె
వినుముర గుడిపల్లి విన్నపంబు

75(ఏవీ photo comments)
నోకియా స్యామ్సంగు నోటిఫై చేయగా
            సెల్కాను ఫోనులు సెటిలు ఆయె
అందకుండానుండె ఆపిలు ధరలేమొ
              ఐపాడు ట్యాబులు అదర గొట్టె
మోటుకాదుర వాడ మోటరోలా ఫోను
             మోటుగా వాడినా మోద మేను
కంపనీ ఏదైన కవిమిత్రు లందరూ
             హైకు వాట్సపు లుంటె హాయి పొందు

విశ్వ మంత ఒక్క విలువైన గ్రామమై
చెంత నున్న తీరు చెలగు చుండె
సెల్లు ఫోను తోనె సేదదీరుచు నుండె
వినుముర గుడిపల్లి విన్నపంబు
75(ఏవీ photo comments)

తలుపు మూసినాడు అతను తత్వ మరసి
సూటి తూపుల తోడనే పయన మాయె
జేబు లోనచేతుల మర్మ మేమొ గాని
అర్ధ మవదాతనిదిచూపు అతను ఏవి
76
ఏవి తాను చూడ ఎంత మం చిగనుండు
నమ్మ వద్దు సెల్లు చేతు లోన
పలుక రించి చూడు పద్యంబు చెప్పును
పలుక రించ కున్న పదము లల్లు
77
కలత లేల మనకు కలసి ఉండగమేలు
కంటి పాప వంటి కమల ములను
వీడ బోము మేము వినుడు నిజమదింక
అమ్మ లార మీది హైకు గ్రూపు
78

చెఱువు
వరద కాల్వల కడ్డుగ కట్టలేయ
చెఱువు నిండుగ నీరేమి చేరదాయె
బతుకు బరువాయె నేడింక భయము పెరిగె
తప్పు చెప్పడు వీరన్న తరచి చూడ
79
చెఱువు పూడ్చేసి ప్లాట్లుగా చేసినాక
పంట భూములు ప్లాట్లుగా మారినాక
తిండి గింజల తిప్పలు తప్ప వేమొ?
తప్పు చెప్పడు వీరన్న తరచి చూడ
80
నీటి కొఱత నేడు మిజమైన బాధాయె
వేల ఫీట్ల లోతు వెల్లి పాయె
చెఱువు లేక నీరు చెంతనుండ గబోదు
తప్పు చెప్ప వీర తరము కాదు
81
పాడి పంట కలుగు పచ్చని పొలమున్న
చెట్లు పెంచ వచ్చు చెఱువు లోన
చెఱువు నింపు కున్న చేరవు కష్టాలు
తప్పు చెప్ప వీర తరము కాదు
82
అలుగు బోయు చెఱువు అందమేమనిచెప్ప
కమత మంత నింప కంటి కింపు
ఉల్ల ముల్ల సిల్లు ఊరుసంతస మందు
తప్పు చెప్ప వీర తరము కాదు
83
ఊర డించు చెఱువు నూరు మింగినదంటె
ఊరి నెవడు గాచు నుర్వి లోన
ప్లాట్లు మింగగలవ ?ప్రాణమ్ము నిల్వగా?
తప్పు చెప్ప వీర తరము గాదు
84
చెఱువు లేని ఊరు చెప్పలేమెక్కడా!
ఊరు లేని చెఱువు ఉండు గాని
ఊరు చెఱువు లన్న ఉన్నత మగు జంట
తప్పు చెప్ప వీర తరము కాదు
85
నీటి మడుగు కాదు నీరున్న చెఱువన్న
పుడమి గర్భ మంత పూర్తి గాను
నీటి తోడ నింపు నిర్మల గంగది
తప్పు చెప్ప వీర తరము గాదు
86
చుక్క చుక్క నీరు చక్కగా చేరేసి
ఒక్క చోట చేర్చ ఒప్పు గాను
వరము లిచ్చు చెఱువు వనదేవతలవోలె
తప్పు చెప్ప వీర తరము గాదు
87
అమ్మ కృప యేల కఱువాయె అవని మీద
కట్ట మైసమ్మ కాపుగా గాయుచున్న
చెఱువు కీనాడు ఈరీతి చెఱుపు. కలిగె
తప్పు చెప్పడు వీరన్న తరచి చూడ
88
తేలు ఇటుకల రామప్ప తేటయైన
చెఱువు మనపాలి సంద్రమ్ము చెంతనుంది
కాకతీయులు ఇచ్చిన కానుకేను
తప్పు చెప్పడు వీరన్న తరచి చూడ
89
ఆడగా లక్నవరమొక్క ఆటవెలది
తేలు ఇటుకల రామప్ప తేటగీతి
ఉదయ సంద్రమ్ము మనపాలి ఉత్పలమ్ము
తప్పు చెప్పడు వీరన్న తరచి చూడ
90
జలధి లేనట్టి తెలగాణ జయము కొఱకు
ఊరుకొక చెర్వు తవ్వించి ఊతమిచ్చి
తీర్చి దిద్దారు గ్రామాల తీరు మార్చ
తప్పు చెప్పడు వీరన్న తరచి చూడ
91
కఱువు రక్కసి కోరలు కత్తిరించ
నదుల నీటిని మళ్లించి నవ్య రీతి
చెఱువులను నింపు మార్గమ్ము చెప్పినారు
తప్పు చెప్పడు వీరన్న తరచి చూడ
92
చెఱువు నీటిలో చేపలు చేరి నపుడు
ఊత తీసుకు కదిలిన ఊసులన్ని
కవనమై మారె మదిలోని కథలు అన్ని
తప్పు చెప్పడు వీరన్న తరచి చూడ
93
తూము నీటిలో తానాలు తూర్పు వైపు
పడమటున్నట్టి కాల్వలో పడిన పాట్లు
మరపు రావన్న నిజమును మనవి జేతు
తప్పు చెప్పడు వీరన్న తరచి చూడ
94
దంటగాల్లతో దండుగా దాడిచేసి
చెఱువు కట్ట పై ఈదుల ఈత పండ్ల
గుత్తులను కోసి మాగేసి గుర్తు లేస్తి
తప్పు చెప్పడు వీరన్న తరచి చూడ
95
కల్లు సాకలు పోసేటి సమయ మందు
కోట మైసమ్మ కే మొక్కి కోన్ని కోసి
చెలిమి చేసిన స్థలమది చెఱువు కట్ట
తప్పు చెప్పడు వీరన్న తరచి చూడ
96
తాటి పండ్లేరి కాల్చిన తావులన్ని
చెఱువు కొమ్మున నున్నవే చెప్పగాను
చెఱువు గుర్తొస్తె మనసంత చెలిమె లాయె 
తప్పు చెప్పడు వీరన్న తరచి చూడ
97
చెఱువు తోడిదె జీవితం చెప్పగాను
ఆడి పాడిన రోజులు అన్ని అచటె
జ్ఞాపకాలన్ని చూడగా జ్ఞానమాయె
తప్పు చెప్పడు వీరన్న తరచి చూడ
98
మాన వాళికి భాషయే మారు రూపు
మాతృభాషన్న గౌరవం మాకు ఎపుడు
అన్య భాషల దూషించు ఆట లేల?
తప్పు చెప్పడు వీరన్న తరచి చూడ
99
మాతృ భాషను నింపుకో మనసు నిండ
పొగడ వలెనన్న ఎంతైన పొగడ వచ్చు
నాగరికమౌన! దూషించ నాంగ్లభాష
తప్పు చెప్పడు వీరన్న తరచి చూడ
100
అన్య భాషలు నేర్చిన అవని పైన
మనసది వికాస మందును మరవనేల?
మాతృ భాషన్న మమకార మంతమవదు
తప్పు చెప్పడు వీరన్న తరచి చూడ
101



No comments:

Post a Comment