Thursday, January 28, 2016

వీరా జన్మదిన అభినందనలు


వీరన్న జన్మ దినమట
రారండయ  వేల కవులు రాతిరి వేలన్
నోరూరెడి వంటలతో
సారిడు భోజనము ,మనము చప్పట్లివగన్!!

వీరన్నకు పరమేశుడు
నూరేళ్ళాయువు నొసంగ నూతనతేజం
బారయ గలిగియు కవితలు
నారూడిగ వ్రాయు నిజము నౌరా యనగన్!!
వీరన్నకు పుట్టినరోజు శుభాకాంక్షలతో కవితాంజలి

అంజయ్య గౌడ్


శ్రీ గుడిపల్లి వీరారెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలతో... 
చిరు కంద కానుక...

వీరుడు పుట్టిన రోజిది
వీరా తలచిన తలపులు విజయము గాంచున్
ఆరోగ్యము లందించగ
రారా రక్షించగ శివ వీరకుతోడై

మీ
గోగులపాటి కృష్ణమోహన్ 


ఉష:కిరణాల హారం
మంచు ముత్యాల. హారతి
మల్లీశ్వరి.  శుభకామనలు
              శుభాకాుక్షలు
         మీరు 
         మీ కవితా
సర్వదా.  
          గెలవాలని
          నిలవాలని
 ఆకాుక్షిస్తూ.----
రాజావాసిరెడ్డి.   మల్లీశ్వరి


3)
రమణుని శిశ్యుం డీతడు
కమనీయ పదములతోడ కవితలు రాసెన్
రమణీయమైన గణితము
కమనీయముగా రచించె కవితలు వీరా
4)
వీరా చెప్పడు తప్పులు
వీరా రాసెను కవితలు వీరా శతకం
ఔరా అనిపించెకదర
వీరా తన గణితశాస్త్ర విజ్ఙత తోడన్

5)
రాయాలని ఉంది కవిత
తీయాలని ఉందినాకు తీయని కావ్యం
చేయాలని ఉంది రచన
గాయాలనుమానిపించ గతమును కృష్ణా

6)
వీరా భలె కవితలను
వీరోచితముగ మనలకు వివరించెకదా
వీరా రాసెను శంభో
వీరేకద గణితమున కవితలు అల్లెన్
కృష్ణ మోహన్



వీరా గారికి ....
గణితమును తెలుగు ఛందో పద్య రూపమున
వెలయించ సంకల్పించారు.
వారికి శుభాభినందనలు.

కం**
చేసెడి పనినే దలచుచు
రాసెను కవితా గణితము రసికులు మెచ్చన్
వేసెను శతకపు పొత్తము
వాసిగ "వీరా" రచనకు, వందన మనరే !!

కం**
లెక్కలు జెప్పుట కష్టము
లెక్కలు జేయుట సులువని లీలన్ దెల్పెన్
లెక్కన పనులను జేయుచు
లెక్కగ బతుకును బతుకని లెక్కలొ జెప్పెన్.


                          అంబటి భానుప్రకాశ్.
                                        స.క.956.
               పాఠశాల సహాయకులు.( S.A.)
           ప్రభుత్వ ఉన్నత పాఠశాల, బుర్దపేట.
                       గద్వాల. పాలమూరు జిల్లా.
                                   9948948787.

వీరన్న జన్మ దినమట
రారండయ  వేల కవులు రాతిరి వేలన్
నోరూరెడి వంటలతో
సారిడు భోజనము ,మనము చప్పట్లివగన్!!

వీరన్నకు పరమేశుడు
నూరేళ్ళాయువు నొసంగ నూతనతేజం
బారయ గలిగియు కవితలు
నారూడిగ వ్రాయు నిజము నౌరా యనగన్!!
వీరన్నకు పుట్టినరోజు శుభాకాంక్షలతో కవితాంజలి

అంజన్న


వీరుడు పుట్టిన రోజిది
వీరా తలచిన తలపులు విజయము గాంచున్
ఆరోగ్యము లందించగ
రారా రక్షించగ శివ వీరకుతోడై

గుడిపల్లి వారి పేరు నిలుప

గుడిపల్లి వారి పేరు నిలుప
తెలుగు "వీరు"డై నిలిచె
పద్య కవనమందు పేరుగంచె
నిలిచె సహస్ర కవులందు రత్నమై
తలచే కవుల లోకమున కవనమై
గుడిపల్లి శిశ్యులకు గురువై
విరాజిల్లు నీవు పుట్టిన దినము సుదినము
పుణ్యము చేసికొనినట్టి పుణ్యదినము
శుభమై ధన్యమై భవ్యమై నిలుచును గాక భవిత
గుడిపల్లి వీరారెడ్డి గారి .పుట్టిన రోజు శుభాకాంక్షలతో... అవేరా

9959539499,రామ బుద్ధుడు

"వీర పుట్టుక"

పుట్టుదురు భువిలో అందరు
అతి సహజముగ
మరి పుట్టిన రోజు
సార్థకమయ్యెనెందరికి
జన్మసారము తెలిసిన వారికె
పుట్టుక కడు వేడుక
"వీర పుట్టుక"
ఎల్ల వారికేమో గాని
మా కవి మిత్రులకు
"కవనీయ" దినం
కడు
"రమణీయ" వరం
రమణ,రమణ యంచు
ప్రతి గమనమున
రమణ స్మరణలో
ఆమరణాంతం నిలువాలని
ఆ" చరణాలనే" చేరాలని
అంత వరకూ
అద్భుత చరణాలను(కవితలను)
లిఖిస్తూ
ఆనందంగా ఆ దరికి
చేరాలని కోరుతూ.....


మీ బుద్ధుడు



సహస్ర కవి మిత్రులకు🌺

🌷మనఃపూర్వక నమస్కారం

మీ ఆదరాభిమానాలు....నేను ఇంతగా ఊహించలేదు

నేనైతే ఏనాడూ పుట్టిన రోజు జరుపు కోలేదు

కానీ ఈరోజు వెల్లువలా మీరు స్పందించిన తీరు నన్ను ఆశ్చర్యపడేలా చేసింది.

🌺

మీ స్పందనల ను చూసి,విని, చదివి ముగ్దున్నయ్యాను

కొందరు హైక్ గృూప్ లో శుభాకాంక్షలు తెలిపారు

కొందరు పర్సనల్ హైక్ అకౌంట్ లో పలపకరించారు

కొందరు ఫోన్ చేసారు

కొందరు పద్యాలు రాసి ఆశీర్వాదాలు అందజేశారు

మరి కొందరు కవితలల్లారు
కొందరు messages పెట్టారు

🌷

Mathematics wats up group s లోనూ
ఇవే స్పందనలు కన్పించాయ్

🌺

ప్రియమైన , ప్రియాతి ప్రియమైన,
హైక్,మితృలకు....నా....కవిమితృలకు
🌺

అన్నా అనే చెల్లెలుకు ,సార్ అనే మితృలకూ
🌺

వీరా సార్ అని పలకరించే.....వారికీ

🍀వీరన్నా  అని ఆదరణ చూపే వారికి

ఆత్మీయ కవితాలోకానికి.....
మీ...అభిమానానికి.....

మీ....🙏🙏🙏🙏

🌺

వీరా......వందనం....అభివందనం

కృతజ్ఞతలు......

ధన్యవాదాలు.....

ఇంకేంచెప్పాలో.....తెలీదు

హృదయపూర్వకంగానమస్కరించడం తప్ప
🙏🙏🙏🙏🙏🙏🙏🙏

వీరన్న జన్మ దినమట
రారండయ  వేల కవులు రాతిరి వేలన్
నోరూరెడి వంటలతో
సారిడు భోజనము ,మనము చప్పట్లివగన్!!

వీరన్నకు పరమేశుడు
నూరేళ్ళాయువు నొసంగ నూతనతేజం
బారయ గలిగియు కవితలు
నారూడిగ వ్రాయు నిజము నౌరా యనగన్!!
వీరన్నకు పుట్టినరోజు శుభాకాంక్షలతో కవితాంజలి
అంజన్న
గుడిపల్లి వారి పేరు నిలుప

గుడిపల్లి వారి పేరు నిలుప
తెలుగు "వీరు"డై నిలిచె
పద్య కవనమందు పేరుగంచె
నిలిచె సహస్ర కవులందు రత్నమై
తలచే కవుల లోకమున కవనమై
గుడిపల్లి శిశ్యులకు గురువై
విరాజిల్లు నీవు పుట్టిన దినము సుదినము
పుణ్యము చేసికొనినట్టి పుణ్యదినము
శభమై ధన్యమై భవ్యమై నిలుచును గాక
గుడిపల్లి వీరారెడ్డి గారి .పుట్టిన రోజు శుభాకాంక్షలతో... అవేరా!!

చివరి గ్రీటింగ్ నాదే వీరారెడ్డి గారే ప్రథమంగా పుట్టిన రోజు చేసుకున్నారు సహస్రకవుల గ్రూపులలో.
జన్మదిన శుభాకాంక్షలు వీరారెడ్డి గారు.

నిరంతరము మీ కవితా యజ్ఞం ఇలాగే కొనసాగాలని కోరుకుంటు.

మేక రవీంద్ర

సుకవి మిత్రులు శ్రీ గుడిపల్లి వీరా రెడ్డి గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. ఆ భగవంతుఁడు మీకాయురారోగ్యైశ్వర్యసుఖసంతోషశాంతిశుభసంతృప్తులనొసంగుఁగాక యని ప్రార్థించుచు...

శ్రీ వాణీ గిరిజేశు లెల్లపుడు స♦చ్ఛ్రేయాన్వితాశీస్సులన్
సేవాతత్పరు "వీర" గారికిడి; సు♦శ్రీ వైభవౌన్నత్య స
ద్భావోపేత విశిష్టకావ్య రచనా ♦ వ్యాసంగ సంసిద్ధికై
చేవన్ బుద్ధిని నిచ్చుఁగాక యని య♦ర్చింతున్ సదా దైవమున్!

భవదీయ మిత్రుఁడు
గుండు మధుసూదన్
వరంగల్

.
🌺

విరుండవై మహ విరంబునా| చిత్త
లూరుండ వినుమయ  హితంబునా ||వి||

నిర్భయుడా నీ కవన లేపములు |ని|
దుర్భలులకునూ దురితములేగద |దు|

సబ్బండంగా వరములొసంగా |స|
స్వయంబూ నీ లింగడెవుండంగా ||స్వ||

పద్యోక్తీ ప్రతికరంబునా |  నిర్భ
యుండ నిడమయ నిజంబునా ||ప||

జోలికివోవూ జోలికిరావూ |జో|
జోజోరమణా జోజోమంటవ్ |జో|

యేడకిబోవూ యేడకిరావూ |యే|
యేడైనా శివ నీడనెవుంటవ్ |యే|

శతండవై బల శతకమునా |  నువ్
స్వయంభు సుతుడవ్ నిజంబునా ||శ||

   🌺 ధన్యవాదాలు...!  🌺

             🌺
             ✏@ కళాచందర్,
                         జర్నలిస్ట్.

🌺🌺🌺✅💐✅🌺🌺🌺
💐💐💐💐💐💐💐💐💐
( 🌺 తప్పులుంటే క్షమించాలి..
        నేను చిన్నప్పుడు విన్న శైలి ఇది.
       ఈ విధానం సంవాదవిధానంగా దర్వులో వుంటుంది.
       దీన్ని మత్తకోకిలంటారా...! ఏమంటారు...!?  అనేది నాకుఇంకా సంశయమే...!!
     సమయంలేదు.
నోరువిప్పిపాడితే ఘోరంగనే ఉండేది. దీన్నివిన్నదానికంటే మీ అంతరికీ రెండంతల మూడింతలు త్రుప్తి ఉండేది.

 మరి ఈ ఇంతరాత్రి టైము.
ఈ సౌండ్లు వినబడితే పక్కపోర్షన్ల మిత్రకుటుంబాలకూ ఇక్కడ గస్తీ తిరుగుతున్న పోలీసులకు కూడా కళాచందర్ లో మరో కళాచందర్ కనపడతాడు.

ఎక్కడో కొంచం అర్థం కలువనట్టు అనిపిస్తున్నది.

సరే...

  ఏవైనా చేర్పులు మార్పులు ఉంటే,  తప్పులువుంటే, మత్తకోకిల పదం తప్పైతే తర్వాత చూసుకుందాం...
టైమయిపోతున్నది...

     🌺 ధనవాదాలు....!  🌺

🌺🌺🌺✅🔔✅🌺🌺🌺 )

వీరాగారు క్షమించాలి. పుట్టినరొేజు. శుభాకాంక్షలు.శతమానంభవతి.కవితలగుడి వీరాగుడిపల్లిగారు. సహస్ర
కవితా కవిగా ప్రాచుర్యం పొందాలని కొేరుకుంటున్నాను.నిన్నఈరొేజు చుాడక ఇప్పుడుచుాచి ఇలా__అన్యధాభావించవద్దు.

మన్నె లలిత
.
🌺

విరుండవై మహ విరంబునా| చిత్త
లూరుండ వినుమయ  హితంబునా ||వి||

నిర్భయుడా నీ కవన లేపములు |ని|
దుర్భలులకునూ దురితములేగద |దు|

సబ్బండంగా వరములొసంగా |స|
స్వయంబూ నీ లింగడెవుండంగా ||స్వ||

పద్యోక్తీ ప్రతికరంబునా |  నిర్భ
యుండ నిడమయ నిజంబునా ||ప||

జోలికివోవూ జోలికిరావూ |జో|
జోజోరమణా జోజోమంటవ్ |జో|

యేడకిబోవూ యేడకిరావూ |యే|
యేడైనా శివ నీడనెవుంటవ్ |యే|

శతండవై బల శతకమునా |  నువ్
స్వయంభు సుతుడవ్ నిజంబునా ||శ||

   🌺 ధన్యవాదాలు...!  🌺

             🌺
             ✏@ కళాచందర్,
                         జర్నలిస్ట్.

🌺🌺🌺✅💐✅🌺🌺🌺
💐💐💐💐💐💐💐💐💐
( 🌺 తప్పులుంటే క్షమించాలి..
        నేను చిన్నప్పుడు విన్న శైలి ఇది.
       ఈ విధానం సంవాదవిధానంగా దర్వులో వుంటుంది.
       దీన్ని మత్తకోకిలంటారా...! ఏమంటారు...!?  అనేది నాకుఇంకా సంశయమే...!!
     సమయంలేదు.
నోరువిప్పిపాడితే ఘోరంగనే ఉండేది. దీన్నివిన్నదానికంటే మీ అంతరికీ రెండంతల మూడింతలు త్రుప్తి ఉండేది.

 మరి ఈ ఇంతరాత్రి టైము.
ఈ సౌండ్లు వినబడితే పక్కపోర్షన్ల మిత్రకుటుంబాలకూ ఇక్కడ గస్తీ తిరుగుతున్న పోలీసులకు కూడా కళాచందర్ లో మరో కళాచందర్ కనపడతాడు.

ఎక్కడో కొంచం అర్థం కలువనట్టు అనిపిస్తున్నది.

సరే...

  ఏవైనా చేర్పులు మార్పులు ఉంటే,  తప్పులువుంటే, మత్తకోకిల పదం తప్పైతే తర్వాత చూసుకుందాం...
టైమయిపోతున్నది...

     🌺 ధనవాదాలు....!  🌺

🌺🌺🌺✅🔔✅🌺🌺🌺 )






Monday, January 18, 2016

వీరా " భావవల్లరి " 1 శతక పద్యాలు



                  గుడిపల్లి వీరారెడ్డి గారి భావవల్లరి శతకపద్యాలు


తాను చేసి మొక్కె తన బొమ్మ కే వాడు
తనదు గీత దాట తానె తాగు
ఎంత తాగి ఊగి ఎవడాపగలడురా
ఒట్టు బెట్టి చెప్ప ఒళ్లు గుళ్ల
1
నీవె రావలెనని నీ కోసమే చూచు
ఆలి నొదిలి బయట ఆగమవకు
వచ్చి పోవు కొత్త వత్సరంబా గొప్ప
వింత కాద నెవరు వివర మడగ
2
అక్కడక్కడతిని ఆటలాడిన తప్పు
కాల ఖండికలను కాచె నెవడు
కాలమన్నదిటుల కదలి పోవునెపుడు
ఆప లేవు నీవు అంతతాగి
3
రమణీయం....2
మధురలోన రమణు డున్నట్టి గృహమేను
పుణ్య క్షేత్ర మయ్యె పురము నందు
రమణ పాద ధూళి రాపాడి నచ్చోట
పాద రేణు లన్ని పరిమళించె
4
మృత్యు భీతి కల్గి మృతుని వోలెను
బిక్క బిగిసి ఒళ్లు బిగియ బట్టె
అనుభవంబు నిచ్చె అతనికో లక్ష్యంబు
రమణ ముని గాధ రమ్య మయ్యె
5
ఎవరి పద్దతేల ఎట్లుండి పోయినా
మతము గోలమనకు మర్యాద కాదులే
అన్ని పద్దతులనుఆదరించెడి వారు
కవిత లల్లెడు కవి కులపు వారె
6
శూలమే ఇట మన శూళి దింపెనుకాద
మునగ కుండ నాడు  మోడు పుడమి
శూలపురము నందు శుభమైన కోనేరు
రమణ పాద స్పర్శ రహిని చూడ
7
మాఘ మాస శుక్ల మందున తిరుచూళి
నీటి తోడ పైకి నిక్కి వచ్చి
పౌర్ణమి అభిషేక ప్రార్థన చేశాక
మెట్టు మెట్టు తగ్గి మోడు బోవు
8
నామ రూప రహిత నమ్మక మన్నది
రమణ తత్వ భావ రాజసంబు
వృత్తు లేవి లేని వృత్తి యేకద నీవు
రమణ బోధ తెలియ రమ్యముగను
9
నాశనమ్మగు మది నాకమునకు దారి
స్వర్గ మంటె వేరు స్వప్న మటర
మనసు నాశనమ్మె మనదైన మోక్షంబు
తెలియ రమణ బోధ తెలుపు నిజము
10
మనసు లేని వాడు మంచి యోగి తెలియ
నిజము నమ్మ గాను నిశ్చయముగ
మనసు నందు ఏమి మరిదాచ లేడుగా
శాంత రూపి తాను శాశ్వతముగ
11
లోకమన్న దేమి లేదురా వేరుగా
నీవు తలచి నట్టి నీదు ఊహ
తలవ మనసు నందె తలచిన దంతయు
కలదు కాని వేరె కలద లేదు
12
మోక్ష మార్గ మన్న మోద మందని వారు
కలర చెప్పు నీవు కలత పడకు
మంత్ర తంత్ర ములతొ మోక్షము సిద్దించ
బోదు ఎపుడు నేను బొంక లేదు
13
ఏబీ బర్దన్...3
మకుట మేల జెప్పు మనసు మాటనువిప్ప
విన్న కన్న వాటి వివర మివ్వ
మానవత్వ మేను మా మతంబని యందు
మకుట మివ్వ లేను మాన్యు లార
14
ముందు చూపు కలిగి ముందు నడిచినట్టి
జనము మనిషి వీవు  జగములోన
బర్దనంటె భావి బలగమౌ బ్రతుకవ్వు
ఎర్ర పూల మాల ఎదను తాక
15
సాటి మనిషి కొఱకు సామాన్యుడి కొఱకు
ఎర్ర దారి తాను  ఎన్నుకొనెను
కమ్యునిస్టు పార్టి కడదాక నడిపించె
బడుగు జీవి యొక్క బాగు కొఱకు
16
అన్న పూర్ణ....4
అన్న పూర్ణ తాను అవలోకనము చేయ
విశ్వ నాథ చిత్త విమల రూపం
కాశికాపురమున  కావల లేదటో
కాంచబోవ మదిని కరము లొగ్గి
17
జ్యోతిర్లింగ రూపు జ్యోతి తానై యుండె
కాశి  క్షేత్ర మహిమ గాంచ తరమె
విశ్వ మంత టికిని విడిది గాదా కాశి
ఉద్భవించె తల్లి ఉర్వి నేల
18
అంతరంగ మందు ఆమె రూపం...5
చిన్న నాటి తలపు చిత్రమనిచెబుదు
మనసు మురిసె నెంతొ మురిపె ముగను
నాటి భావనలను నా మది తలపోయ
అంతరంగమందు ఆమె రూపం
19
చేయలేదు బాస చేతుల చేయేసి
విడవ లేదు ఎపుడు వినతి సేతు
ఎటుల మరతు నేను ఎన్కటి విషయాలు
అంతరంగ మందు అంత తానె
20
చుట్టు చేతు లేసి చుట్టూర తానాయె
నన్ను వీడ లేదు నానాటి నెచ్చెలి
నవ్వు నవ్వ్వె నెంతొ నయన భాగ్యంగల్గ
అంతరంగమంత ఆమె నాయె
21
నీటి కొఱకు వెతలు నీకేల నాకేల
నీరు లేక బతుకు నీకు వచ్చు
ఏట మారి పోవు ఏమితినక బత్కు
బత్కు రోజు  వచ్చు బాధ పడక
22
పఠాన్ కోట్ ఉగ్రదాడి....6
పాకు మూక పనులు పాశవికముకద
ఉగ్ర వాద మన్న ఉల్ల సిల్లు
భార తీయు లన్న భయపడు పాకులు
వెన్ను పోటు పొడవ వెరవ రెపుడు
23
అమర సైని కులకు అంజలి ఘటియించి
ఆత్మ శాంతి కొఱకు ఆల పించు
గాన మంద జేయు గమనము కవులది
వినతి సేతు కవిత వివర మివ్వ
24
వేయి మంది నేడు వేగమె స్పందించి
కవిత లెన్నొ రాసి కవన మహిమ
తెలప వలెను కవుల తెగువను తప్పక
భరత వీరు లంత భగ్గు మనగ
25
వీరు డెపుడు పుట్టు వీరత్వ మందిన
భరత భూమి లోనె భవ్య ముగను
పిఱికి బాంబు దాడి పిచ్చిపనులనింక
తిప్పి కొట్ట తాను తిరిగి పుట్టు
26
ఓడి పోడు ఎపుడు ఓటమె తెలియదు
భరత మాత సేవ భార మవదు
వెన్ను పోటు దారు వెతలు ముందున్నవి
పిఱికి ఉగ్ర మూక పీచ మణచ
27
జర్నలిస్టు....7
జీత మేది లేదు జీవించు వార్తలు
రాసి రాసి రాసి రాసి యన్న
అక్రమాల కథలు అదలించు మిషతోటి
బతకమన్న తప్పు భావనొచ్చు
28
జర్నలిస్టు లనగ జనము మనుషు లేర
జాతి మేలు కోరు జాతకమ్ము
జనము బాగు వారి జెనెటిక్ కోడయ్యె
జర్నలిస్టు తాను జనము మనిషి
29
నిజము వెలికి తీయ నీరస మెరుగడు
జీత మెరుగ నట్టి జీవి తాను
అక్రమాల తీరు అరక దున్నగలడు
జర్నలిస్టు తాను జనము మనిషి
30
ఆలు పిల్లలంత అతని కొరకు జూడ
తాను మాత్ర మేడ తనపనందు
ఏమి తినెనొ లేదొ ఎవరి కెఱుకలేదు
జర్నలిస్టు తాను జనము మనిషి
31
బయలు దేరి వెల్లు బాటలు బహు బాగు
పయనమంత సాగు పాటవమున
ఎవరి తీరు వారి ఎదుగు దలను చూడ
జర్నలిస్టు తాను జనము మనిషి
32
అండ నిలువగాను అందరు కనిపించు
ఎదురు లేని మనిషి ఎన్ని చెప్పు
జనము కతడె రక్ష జగతిలోన ఎపుడు
జర్నలిస్టు తాను జనము మనిషి
33
దేహము దేహి....8
ఆత్మ తొడిగిన దిది ఆత్ర మెక్కువదేమి
దేహ మన్న మాట దేహి తొడుగు
ఆత్మ విడిచినపుడు ఆరీతి బాధేల
నూత్న దేహ మొచ్చు ననియు మరచి
34
మరణ మన్న నేమి మారు దేహమెకాద
జీర్ణ వస్త్ర మొదలు జీవి తాను
విషయ మెరుగ వలయు విపులంగ మనమైన
చిన్న విషయమునకు చింత వలదు
35
చెప్ప డమ్ము కాదు చేసి చూపుటగొప్ప
వట్టి మాట లెన్ని వల్లె వేయ
వచ్చు లాభ మేమి వల్లెక్క మేకదా
చేసి చెప్ప గొప్ప చేత నైతె
36
చందమామ రూపు చందన పరిమళం
చక్క నైన ముద్దు చక్కిలమ్ము
వంక బెట్ట లేని వన్నె చిన్నలతోటి
ఏల నన్ను వలచె ఎరుగ నైతి
37
వెలుగు తానై రాగ వెనుకడు గేశాను
చేయి దాటి పాయె చేత గాక
వెన్నె లన్న వన్నె వెన్నెల లొద్దన్న
వేడు కన్న దెరుగ వెధవ నైతి
38
పుట్టు గిట్టు లేవి పుడమి పై నెప్పుడూ
నిలకడెరుగ నట్టి నిజము గాదె
తెలిసి కూడ తాము తెలియ నట్ట్లుండగా
దేని నాప గలడు దేహి తాను
39
దేహి యెపుడు తాను దేహమని తలవ
జ్ఞాన మగునె తాను జ్ఞాని యగునె
"నేను"పుట్టు తావు నేర్పుగ తెలిసిన
జ్ఞాని యగును తాను జ్ఞాని యగును
40
కష్ట కాల మంటె కలగన్న దానిలో
ఇష్ట మైన దేదొ ఇంట లేక
ఇమడ లేని, నీవు ఇరుకు మనసు, తెల్వ
లేక, తెలివి లేని లేకి వౌట
41
ఇతరములు....9
పొగడ వినగ మనసు పోరుసల్పునుగాద
కీర్తి కాము కత్వ కీట కమ్ము
పొగడ లేని మనసు   పొరుగు వారలగొప్ప
చెత్త కుప్ప తీరు చెప్ప గాను
42
శివ ధనువును విరిచి శివదోష మునుచేసి
రాము డడవి కెల్లె రాజ్య మొదిలి
ఎంత వార లైన శివదోష మంటెనా
అనుభ వించ వలెను అవని మీద
43
హారతి...10
చితిని పేర్చి నపుడు చిత్తమందు తలతు
శంభు పదము జేర శంక లేక
కాలి బూడి దవగ కాయమం తయు నాడు
హరుని పాద ములకు  హార తిద్దు
44
కళ్ళు రెండు నీకు కానుకై దీపాలు
కాంచు చుంటి జగము గాంచు చుంటి
మంచి చెడుల జూడ మంచి వేడుక నీది
ఎంచ నిన్ను నేను ఎంత వాడ
45
నారి కేళ మేల నామరూ ప రహిత
నారి కేళ మన్న నాదు శిరమె
నీకు హార తవగ నీటిలోన మునిగి
సిద్ద మైన దిదిగొ సిద్ధ రూప
46
అన్న దమ్ము లన్న ఆత్మ బంధువు లేను
ఆడ పిల్ల తాను ఆత్మ యయ్యె
చెల్లి వేరు కాదు చెప్ప తల్లి యె గాని
వినదగు గుడిపల్లి వీను లలర
47
ఒకరి కొకరు నేడు ఒక్కటై నిలిచిన
తాడు బొంగరాలు తప్పు కాదు
తిప్పు తాడు ఎవరు తిరుగున దెవ్వరో
తాళి కేమి తెలుసు తనకు చెప్ప
48
అంజన్న....11
పదము లేల నీకు పడిపడి కూర్చొను
గణము లాగ మవక ఘనము గాను
కథన మేది నీకు కాసింత శ్రమగూడ
ఇవ్వ లేక నొదుగు ఈప్సితముగ
49
ఏమి భాగ్య మోయి ఏల నీకు కలిగె
చదువులమ్మ కృప చల్లగాను
కలము నాట్యమాడు కథనము చెదరక
అంజ నంబు వేయ అర్థ మవదు
50
గణము లన్ని నీకు ఘనమైన మిత్రులు
పదము పదము నీకు పాదపమ్ము
తెలుగు భాష నంత తెలివితో  పట్టేసి
ఏమి తెలియదంటు ఏల మోసం
51
పద్య పాద మన్న పదములొచ్చి పడును
కథన మెన్ను కున్న కావ్య మగును
విసర మొదలు బెట్ట విలువైన పద్యాలు
ఒక్కటొక్క టొచ్చి ఒడిని వాలు
52
బాసరమ్మ నిన్ను బాగుగా చూస్తుంది
బాస చేసె నేమొ బాబు నీకు
వందన మును సేతు వందనీయుడి వీవు
ఆంజ నేయ గౌడు అందు కొమ్ము
53
గీత మాల పించ గీడుగా డననేమి
తప్పు కాదు ,ఒప్పు తనరు గాని
సూక్తి చెప్పు నపుడు సూత్ర ప్రాయమ్ముగా
ముద్దు పిలుపు లెపుడు ముద్దు గుండు
54
మధ్య పాన మన్న మదిలోన గుబులేల
సుధల బోలు నట్టి సుక్క కాదు
బొట్టు బొట్టు నిన్ను బొక్కల బెట్టంగ
వొట్టు బెట్టు కోని వొచ్చు చుండె
55
సుక్క వెంట ముక్క సూటిగ కోరేవు
సుక్క సుక్క మింగి సుక్క లొంక
జూసి ,పొగ పీల్చ జూసేవు తెంపరీ!
మత్తు దిగిన కాద మనిషి నీవు
56
నిన్ను మోయు వారు నిజరూప మునుదాల్చి
ఒక్క మాట పైన ఒల్క నీరు
మా వివేక మేమొ మాసిపో వునుగాద
మంద బలము పట్ట  మంకు పట్టు
57
గూఢము గురు మూర్త గుర్తు చింతల తోపు
గురుడు రమణు డున్న గుర్తు లచట
గూఢమైన మౌన గూడార్థ మెరిగించు
గుర్తు లున్న వచట గుప్త ముగను
58
వట్టి మాట లేగ ఒరగబెట్టినదేమి
మోయు వారు జూపు మోజు తప్ప
ఒరగబెట్టినట్టి ఒక్కపనినిచూపు
తప్ప కుండ నేను తప్పు కుందు
59
గిరివళమ్ము చేసి గిరి రూపు కొలిచాక
సహజ నంది మ్రొక్కి సంతసించి
ఆల యమ్ము జేరి ఆనందము తోడ
ధ్యాని నైతి వేరు ధ్యాస లేక
60
కవితా గణితం. 12 (గణిత్వం)
మూడు కోణములను మూడు భుజములను
కలిగిన బహు భుజియె కదర త్రిభుజి
కోణములను గొలువ కొలతల మొత్తము
నూట ఎనబ యుండు నూరు బాల్లు
61
సహజ సంఖ్య లన్న సాగు నొకటినుండి
అంత మవని సమితి అందు రదియు
పూర్ణ సంఖ్య లన్న పూర్ణము తో సాగు
అపరిమితము దాని ఆన వాళ్ళు
62
సంత సమ్ము తెలియ సంఖ్యలలో గూడ
కల్పితాలు గలవు కనుము నీవు
రూటు మైనసొకటి రూటది సపరేటు
కల్పితమ్ము అదియు కఠిన నిజము
63
వ్యాసమందు సగము వ్యాసార్థ మందురు
జ్యాల లోన పెద్ద జ్యాయె నదియు
లెక్క కంద జ్యాలు లెక్కలేనన్నుండు
ఎన్ని గలవొ చెప్ప ఎఱుక లేదు
64
ఏజు బారు కాగ ఎవరుగూ డనుపిల్ల
నివ్వ రైరి, జాబు నీడ లేక,
వచ్చు జాడలేక,  వడలిన మనసుతో,
హరిని,గన్న తండ్రి హడలి సచ్చె!
65
తెలుగు 13
ఎవ్వ డాప గలడు ఏ మార్పు నైనను
ఎదురు చూసి చూసి ఏడ్చు తప్ప
తెలుగు ఎపుడు గూడ తెరమరుగవ్వదు
భయము వలదు తెలుగు భక్తి చాలు
66
మృత భాష కాదు మృతి తెలియబోదు
తెలుగ భాష వెలుగు తేజ మలర
మనుజ మనుగడున్న మహిలోన తెలుగన్న
భాష మనుగ డుండు భాను తేజ
67
తెలుగు వెలుగు నెపుడు తెలుగు ప్రేమికులార
తెలుగు జాతి తెగువ తెలియ లేవ
కలిసి యుండ గలరు కాదంటె విడిపోయి
మనసు లేక మయ్యి మసల గలరు
68
మధుర మైన భాష మనదొక్క టేగాదు
మాతృ భాష లన్ని మధుర మేను
భాష లెన్ని నేర్చి భావమ్ము తెలిపిన
మరువ లేరు ఎవరు మాతృ భాష
69
భాష మనది యైన భావమ్ము చెడిపోదు
చెప్ప గలుగు నెపుడు చెవుల తీపి
మాతృ భాష తోడ  మారుభాషను నేర్వ
ప్రగతి నొందు నింక ప్రతిభ పెరుగు
70
అభిప్రాయం...14
అఖిల్...కృష్ణ మోహన్
అఖిల లోక మెరుగు అయ్యపేరు ఇపుడు
వేయి కవుల కతను వేడ్క నేడు
జన్మ దినము నాడు జయము పొందగనీకు
వేడు కొందు శివుని వేడ్క మీర
71
కూన నాడు  తాను కూనూరు పిలగాడు
జన్మ నిచ్చి నీకు జనకు డాయె
జన్మ దినము నీది జయము కలుగు గాక
అయ్య సేవ నీకు అభయ మివ్వ
72
ఏవీ రావు
ఏవి రావు తాను ఏదైన రాసేను
పద్య మన్న పెద్ద పనియు కాదు
తల్చు కుంటె తనకు తలపున మెరవదా
పద్య మొక్క సారి పరిమ ళించి
73
అరుణ
నవ్వు కర్థ మన్న నవ్వి వదలు రీతి
అరుణ కవిత తీరు అక్కజంబు
ఇన్ని నవ్వులున్న ఈరీతి అర్ధాలు
అరుణ చెప్పి నాక అర్ధ మాయె
74
తండ్రి...మనసు...15
తల్లి మనసు కోరు తనయుడి క్షేమంబు
తనయ తలపు లేని తల్లి కలదె
తండ్రి మనసు తెలియ తండ్రి యగుటతప్ప
మార్గ మేది జూడ మనకు లేదు
75
ఆలు పిల్ల లన్న ఆతని ప్రాణంబు
కష్ట మన్న దెపుడు కలగ కుండ
కళ్ళ లోన నిలిపి కాచు చుండును గాద
తండ్రి మనసు తెలియు తండ్రి యైన
76
కాలం.....16
మరణ మన్న మాట మరణించె కాలమా!
నిత్య యవ్వ నమ్ము నీకు సొంతం
మెఱుపు తీగ వంటి మెఱుపు లున్నవికాద
సామ్య వాది వీవు సమ్మ తింతు
77
కరుగు మంచు రీతి కవన భాగ్యము కల్గి
సంతసమ్ముగ నేను సంచ రించ
ఆగి సాగు తుండు ఆత్ర మన్నది లేక
కష్ట కాల మందు కఠిన ముగను
78
రాజు లెంద రైన రాణించి ఉండొచ్చు
కదన రంగ మందు కత్తి దూసి
కాంచ గల్గి నార కాల మహిమ తాము
మట్టి గలిసె గాని మహిని వారు
79
జీవి తాంత మెంత జీవి కైనను గాని
అడుగు వేసి నంత ఆగకుండ
సాగుతూనె ఉండు సాత్వికమ్ముగ తాను
కొలత వేయ లేము కొలవ గాను
80
ఆది అంత మేది? ఆనంద యానమ్ము
సృష్టి కన్న,  దృష్టి సృష్టి ,నీవు
అంత నీవె కాద అంతమన్నది లేని
అంత రాత్మ సృష్టి అందు నమ్మ
81
పతగము....17. ..(పతగము=పక్షి)
ప్రాణమెంత ఎగిరి ప్రావీణ్యతను చాటు
నిక్కు మెక్కు లున్న నీవు చూడ
అందనంత ఎత్తు అల సాగి పోవుగా
వతగమెంత గొప్ప పాటి గలది
82
చిన్న ప్రాణి తాను చింతలేనిది చూడ
చిక్కి పోదు తిండి చింత లేదు
ఆకసమ్మె దాని అనుగు వీథి ఎపుడు
పతగమెంత గొప్ప పాటి గలది
83
సెల్లు ఫోను లొచ్చి సైలెంటు గాజంపె
చిన్ని ప్రాణి తనను చిదిమి వేసె
ఊర పిచ్చుకేది ఊర కన్పించదు
పతగ మస్స లింక బతక దాయె
84
సంక్రాంతి...18
రాశులన్న నేమి రాయని రాతలు
మింట మునులు కొలత మించకుండ
మనసు నిండి పోగ మకర రాశినిజేరి
వెలుగు నిచ్చు వాడు వేడ్క దెచ్చె
85
విశ్వ మంత నాడు విశ్లేషణేజేసి
వివర మిచ్చి నారు విజ్ఞులంత
సూర్య కేంద్ర గణన సూత్రాలు సంక్రాంతి
సంబరాలు దెచ్చె సంతసముగ
86
అంద రొక్క చోట హాయిగా జీవితం
అనుభ వించు కొఱకు ఆట వలెను
వచ్చు పర్వ దినము వరమైన బలమన్న
మరువకు గుడిపల్లి మాట నెవుడు
87
గణిత్వం...12/1
బీజ గణిత మనగ బిగువైన లెక్కల
బిగిని సడల జేయు బీజ మాయె
అంకగణిత మునకు అందాల నద్దులే
మరువకు గుడిపల్లి మాట నెపుడు
88
నాల్గు మూలలైన నాల్గు లంబములేను
కర్ణముల కొలతలు కదర సమము
అట్టి కొలత లలర అదియె చతురస్రము
మరువకు గుడిపల్లి మాట నెపుడు
89
ఒక్క జత భుజము లొక్క దూరము నున్న
పిలవ ట్రెపిజియమ్ము పిలుచు కొమ్ము
గణిత మందమైన గణనల శాస్త్రమ్ము
మరువకు గుడిపల్లి మాట నెపుడు
90
నాల్గు మూల లేమొ నాల్గు లంబము లేల
కొలవ భుజము లొక్క కొలత లైన
సమ చతుర్భుజమ్ము సాగ కర్ణమొకటి
మరువకు గుడిపల్లి మాట నెపుడు
91
రెండు రెండ్లు నాల్గు ,రెండు మూడుల ఆరు
మూడు రెండ్లు ఆరె ముచ్చటగను
వరుస మార్చ విలువ వాసి మారదెపుడు
మరువకు గుడిపల్లి మాట నెపుడు
92
గీయ త్రిభుజి మూడు గీతలే అనుకోకు
మూడు కొలత లున్న ముచ్చ టౌను
ఒక్క గట్టి కొలత ఒడుపు చదరమిచ్చు
మరువకు గుడిపల్లి మాట నెపుడు
93
అభిప్రాయం.14/1
వాసిరెడ్డి
చెప్పు కవిత జెప్పిచెప్పు బాదలుతెల్పె
వాస్తవముగ నేడు వాసి రెడ్డి
చెప్ప కవిత  తాను చెలిమి చెదరనీదు
మరువకు గుడిపల్లి మాట నెపుడు
94
రమణు నెట్లు మరతు రాజిల్లె మౌనిగా
రమ్య మైన రీతి రాజు కొనగ
మౌన మేల మనసు మౌనము గామారె
మరువకు గుడిపల్లి మాట నెపుడు
95
గోచి తోనె గుహల గోప్యంగ జీవించె
మహిమ లేవి జూప మదన పడడు
తాను తానై యుండ తపసి యనిరిగాద
మరువకు గుడిపల్లి మాట నెపుడు
96
బయలుదేరి వచ్చి బాటసారిగ తాను
యోగి యయ్యె మౌన యోగి యయ్యె
రమణు డరుణ గిరిని రమణ మయము జేసె
మరువకు గుడిపల్లి మాట నెపుడు
97
మాసి పోని వెలుగు మా రమణ మహర్షి
వెళ్ళు దారి లోన వవెలుగు తానె
కళ్ళు దారి చూప కాంతి తానుగమారు
మరువకు గుడిపల్లి మాట నెపుడు
98
ఎంత పండగైన ఎంత గా పని యున్న
వదల లేదు హైకు వదల రాయె
కవిత లన్న తనకు కనుల వెలుగు లాయె
మరువకు గుడిపల్లి మాట నెపుడు
99
ముగ్గు లేసి రాళ్ళు ముగ్గుచుట్టు బెట్టి
దారి మూసి నారు దయను మరచి
తిరగ దారి లేక తిప్పలెవరికొచ్చె
మరువకు గుడిపల్లి మాట నెపుడు
100
మార్పు సహజ మమ్మ మానవ ప్రగతికై
పాత నొదలకున్న పనికి రాము
జ్ఞాపకాల లోన జ్ఞానము దాగుంది
మరువకు గుడిపల్లి మాట నెపుడు
101
ఎందు కింత బాధ ఏల సుఖము లేదు
ఇంత బాధ నెరుగ ఇంత దనుక
తాను తిట్ట కున్న తప్పదెపుడు బాధ
ఆలి తిట్లె నాకు అసలు సుఖము
102