Sunday, February 21, 2016

వీరన్న పదాలు శతకపధ్యాలు

                           గుడిపల్లి వీరారెడ్డి
                             శతక పద్యాలు




వీరన్న పదాలు(25.11.2015)

ఆకులలముల కన్న,కూరగాయల కన్న,
వెర్రిఉల్లి కన్న , పప్పుబెల్లము కన్న
మాంసహారమె నేడు చవకాయె చూడర
తప్పు చెప్పడు వీరన్న తరచి చూడ
                                                          ..1

కార్తీకమాసమని కాంతలందరు నేడు
దీపాలు వెలిగించి ధూపంబు నిచ్చి
కోరుకున్నదేమి? మగని మేలే కదా!
తప్పు చెప్పడు వీరన్న తరచి చూడ.
                                                            .2

గెలిచినంతనె నీవు గొప్ప కాదుర బాబు
ఓడిపోయినోడు ఊరుకోడు
గెలుపు నిలుపుకొనుటె గొప్ప కార్యంబౌను
తప్పు చెప్పడు వీరన్న తరచి చూడ.........
                                                               3
ఓరుగల్లు నేడు పోరుగల్లుగ మారి
గొప్ప గెలుపునీకు కట్టబెట్టె
నిన్నె నమ్మిన దెందుకో నీకు తెలియును కదా
తప్పు చెప్పడు వీరన్న తరచి చూడ.  
                                                              4
 ఆగమాగంబుగ అడ్డగోలుగ బోవ
రాచమార్గము నిన్ను రాకాసి యై మింగె
తల్లి కడుపు కోత బాధ యెవనికి బట్టె
తప్పు చెప్పడు వీరన్న తరచి చూడ.
                                                               5
గుళ్ల చుట్టూ తిరిగి, పూజలెన్నో చేసి
నైవేద్యము బెట్టి, నారికేళము గొట్టి
మగని మేలే కదా మగువ కోరేదెపుడు
తప్పు చెప్పడు వీరన్న తరచి చూడ.
                                                             6
ఉపవాసముండినా ,ఉండ్రాళ్ళు చేసినా
గణపతిని తానెంత గణుతించినాగాని
మగని కీర్తిని పెంచ మగువ కోరిక కదా
తప్పు చెప్పడు వీరన్న తరచి చూడ.
                                                              7
అర్థాంగి నిదురోవ అర్ధరాత్రి లేచి
పద్యంబు రాసి తన పాదాల నుంచగా
నిద్రలేచిన తాను నిష్ఠూరమాడెరా!
తప్పు చెప్పడు వీరన్న తరచి చూడ.
                                                            8
మాలధారణ చేసి నియమాలు పాటించి
శబరిమలకే వెళ్ళి శబరీషు నే మొక్క
మనిషి మనిషిగ బ్రతుకు మార్గంబు తెలియదా!
తప్పు చెప్పడు వీరన్న తరచి చూడ.
                                                              9
స్వామి మాలను వేసి,స్వామి స్వామి యంటు
సర్వ జీవులలోన, స్వామి నే దర్శించ
భేదభావము లేక..తానె స్వామైపోవు!
తప్పు చెప్పడు "వీరన్న" తరచి చూడ
                                                          10
(అద్వైత తత్వం)
మేఘాలు కమ్మగనె వర్షాలు కురియునా?
మొగుడన్న ప్రతివాడు మోసమ్ము చేయునా
ధనవంతుడైనంత ..దానగుణముండునా ?
తప్పు చెప్పడు వీరన్న తరచి చూడ.
                                                              11
ఎండగొట్టిన గాని ,వాన కురిసిన గాని
గొడుగు క్రిందకె కదా చేరుకుందుం
మంచి చెడు లెట్లున్న మనిషికారడుగులే!
తప్పు చెప్పడు వీరన్న తరచి చూడ!!
                                                             12
వాడున్నడో లేడొ! వాదులాటెందుకు?
ఎవడుండి మనకొరగ బెట్టింది ఏమిటి?
నీవు చేసిన పనియె నీకు తిండి పెట్టు
తప్పు చెప్పడు వీరన్న తరచి చూడ.
                                                             13
పెద్ద లాయరు కొడుకు,బాగడబ్బున్నోడు
అన్ని వదిలి వెళ్ళె అరుణాచలం
ఎంత ఉన్నా గాని , అనుకుంటెనే మనదిరా!
తప్పు చెప్పడు వీరన్న తరచి చూడ
                                                           14
మంచి చెడు లేవైన మాటతోనే వచ్చు
కొంచెమైన మనసు పెట్టి చూడు
నోరు మంచిదైన ఊరు మనదౌనురా!!
తప్పు చెప్పడు వీరన్న తరచి చూడ
                                                         15
అహము విడువడ మంటె అంతసులభం కాదు
అన్ని విడిచినపుడె అది సాధ్య మగును లే
మౌనమొక్కటె మనకు మంచి మందౌను గా!!
తప్పు చెప్పడు వీరన్న తరచి చూడ
                                                        16
ఒకటి తింటె పాప మొకటేమొ పుణ్యమా?
ఏదైన జీవేననెట్ల మరిచారో
ఈ పాప పుణ్యాల నిర్ణేత  పాపిరా!!
తప్పు చెప్పడు వీరన్న తరచి చూడ
                                                           17
మతిలేని పనులకు ప్రాపంచ రికార్డు
పసలేని పనులతో మతిలేని వాల్లుండ
పనిలేని వాడెవడొ పిల్లి తల కొరిగెనట
తప్పు చెప్పడు వీరన్న తరచి చూడ
                                                         18
 కొబ్బరొక్కటి కొట్టి కోటి వరములు కోరె
మూడు కత్తెర లిచ్చి చూడు మోసం చేసె
నోరులేనప్పుడు ఎవరైతె ఏమిటి
తప్పు చెప్పడు వీరన్న తరచి చూడ
                                                        19
గంగలో మునిగిన బెంగ తీరి పోవు
నారికేళము తోని నాటి కోర్కెలు తీరు
పనితనమ్మే కదా ఫలము నిర్ణయించు
తప్పు చెప్పడు వీరన్న తరచి చూడ
                                                     20
బడిలోన గుడిలోన బాడుగ పనిలోన .
విశ్రమించ వలదు విధిగ నెపుడు
కలలు గనుచోటు కాదది కార్యస్థలము
తప్పు చెప్పడు వీరన్న తరచి చూడ
                                                        21
నీకునచ్చినట్లు నీవున్న సరిగాని
ఎల్లరుండమనుట పాడిగాదు
ఎవడికాడే గొప్ప..ఏమందువు
తప్పు చెప్పడు వీరన్న తరచి చూడ
                                                        22
ధూమపానం తప్పు,ధూర్త భాషణ తప్పు
మాధ్యపానము తప్పు,మాటతూలుట తప్పు
తప్పులెన్నుట తప్పు,తప్పదనుటే తప్పు
తప్పు చెప్పడు వీరన్న తరచి చూడ
                                                          23
తాళి కట్టినపుడె తాను హితురాలయ్యె
తనువులేకమయ్యె తాను నీ వయ్యె
అర్థాంగి కాదురా! అంత తానే నీకు
తప్పు చెప్పడు వీరన్న తరచి చూడ
                                                          24
తల్లి ,నాలి ని పోల్చుటెందుకు?
తగవు లాటను పెంచుటెందుకు?
ప్రాణ మిచ్చిన దొకరు ప్రాణమైనదొకరు
తప్పు చెప్పడు వీరన్న తరచి చూడ
                                                          25
పొద్దు పొద్దు న లేచి,నీ నిద్ర చెడగొట్టి
నిష్ఠూరమాడుతునె నిన్ను సిధ్ధం చేసి
అరనవ్వుతో కన్పించు ఆలి కద దైవంబు
తప్పు చెప్పడు వీరన్న తరచి చూడ
                                                          26
                                                 
దినమును మొదలెట్టి దినకరున్నోడించి
ఇంటిల్లి పాదికీ అన్ని తానై నిలిచి
అవని పై స్వర్గంబు ఆవిష్కరించెరా!!
తప్పు చెప్పడు వీరన్న తరచి చూడ
                                                          27

కలము పట్టినోడు కైత రాయవచ్చు
కమ్మకమ్మగ కథల నల్లవచ్చు
ఆలకించు మంతె అన్ని నమ్మగ రాదు
తప్పు చెప్పడు వీరన్న తరచి చూడ
                                                        28

  లెక్కలెక్కాలేవి తెలియకున్నను గాని
చదువ అక్షర మసలరయకున్న
లక్కుచాలద లచ్చలెనకేసుకోను
తప్పు చెప్పడు వీరన్న తరచి చూడ
                                                        29
29.11.2015

ప్రగతి కామ్యత లేని పాండిత్యమును చూపి
కాల్పనిక భావాల కవితలెన్నో రాయ
భావజాడ్యమె కాని వేరు కాదు
తప్పు చెప్పడు వీరన్న తరచి చూడ
                                                      30
చమట చిందెడి చంద్రహాసుల  మరచి
బువ్వ పెట్టెడి బక్క రైతు నిడిచి
భామలందములోన బ్రహ్మాండ ముండునా
తప్పు చెప్పడు వీరన్న తరచి చూడ
                                                      31
తనువు పుండైపోయి తాను పండైనట్టి
అంగట్ల సరుకైన ఆడదానిని చూసి
వెలయాలనంటావు వెనుకున్న దెవరురా
తప్పు చెప్పడు వీరన్న తరచి చూడ
                                                       32
తనువు నే సరుకుగాతాపంబు  దీర్చేటి
తాపసిని పట్టుకొని వెలయాలనందువా
పూబంతులట్లైన పుణ్యంబు నీదె కద
తప్పు చెప్పడు వీరన్న తరచి చూడ
                                                     33
బీడుభూమికన్న బోడు బండల కన్న
జుట్టు లేని నా బట్ట తలకన్న
అందమైనట్టి  కందపద్యం మేలు
తప్పు చెప్పడు వీరన్న తరచి చూడ
                                                     34
30.11.2015

తలచినంతనె  తనయుడివయ్యావు
గణపతిని చేసి గణుతించినారు
భావమేతప్ప బంధమేమున్నది
తప్పు చెప్పడు వీరన్న తరచి చూడ
                                                     35
తాల్చగ తానొక్క పిండి బొమ్మను నాడు
తల్లి పార్వతి కోర్కె తీరెగాని
భావనే తప్ప చెప్పగా బంధమేది?
తప్పు చెప్పడు వీరన్న తరచి చూడ!!
                                                         36
తండ్రి కోపము తోడ తలతీసినప్పుడు
తల్లి కోరిక మేర నీ తలను మార్చే
ఆలి కోసమె గాని అందునీదేముంది
తప్పు చెప్పడు వీరన్న తరచి చూడ
                                                       37
అమ్మచుట్టు తిరిగి ఆట గెలిచితి నంటు
గణనాయకత్వంబు చేపట్టినపుడు
శంభులీల లోన పావు వైతివి కదా
తప్పు చెప్పడు వీరన్న తరచి చూడ
                                                        38
సొంత బంధము లేని శంభులీలలోన
శివతత్వ మర్మంబు గణపతిజననంబు
బంధమంటె భావసంబంధ మని జెప్పె
తప్పు చెప్పడు వీరన్న తరచి చూడ
                                                      39
నల్లదుస్తులు వేసి నుదుట నామం రాసి
పొద్దు మాపనిలేక శరణమయ్యప్పంటు
దీక్ష పూర్తి చేయ దక్షుడి వౌదువు
తప్పు చెప్పడు వీరన్న తరచి చూడ
                                                        40

1.12.2015

ఏకలింగము సొంతమా ఎయిడ్స్ వ్యాధి
ఒక్క చేతితొ చప్పట్లు కొట్టగలవా
నీతి తప్పిన,పాణమేదైన,తప్పదంతె
తప్పు చెప్పడు వీరన్న తరచి చూడ
                                                        41
ఎప్పుడొకవైపె తప్పన్న దుండబోదు
ఆడ,మగ మద్య అగ్ని అంటించబోకు
దారి తప్పిన వారి నపహసించుట తప్పు
తప్పు చెప్పడు వీరన్న తరచి చూడ
                                                          42
అందరొక్కటన్న సత్యంబు చెప్పగా
అవని పై మన కొక్క మార్గముంది
అలవోక గా చూడు అయ్యప్ప మాలదీ
తప్పు చెప్పడు వీరన్న తరచి చూడ
                                                        43

రమణ మార్గమెంతొ రమ్యమైనది చూడు
మనసు మౌనమె ముఖ్యమన్నది నాడు
తెలిసి మనుటయె సత్య మౌనది నేడు
తప్పు చెప్పడు వీరన్న తరచి చూడ
                                                        44

  ఏమి చదివి నావు,ఎంత చదివినావు
ఎక్కడ చదివింత ఎదిగినావు
ఎఱుక చెప్పిన పుణ్యంబు అంతనీకె
తప్పు చెప్పడు వీరన్న తరచి చూడ
                                                         45
2.12 . 2015

అన్ని తెలిసినోడె ఆగమైపోయినట్లు
చదువులమ్మవయ్యు సంగీతనిధివయ్యు
తలలేని వాడి కిల్లాలి వైనావు
తప్పు చెప్పడు వీరన్న తరచి చూడ
                                                           46
సృష్టించి వదిలేసె సృష్టి కర్తయంట
చూడలేక సాకెవాడు వేరే నంట
చదువులమ్మిట్ల... నీ మొగడు చేయతగునా!
తప్పు చెప్పడు వీరన్న తరచి చూడ
                                                        47
జిలకర లో కల్తి,జీడి పప్పులొ కల్తి
మెంతుల లో కల్తి,తంతు తంతు న కల్తి
మేడిపండే నేడు మేటి గా నిలిచింది
తప్పు చెప్పడు వీరన్న తరచి చూడ
                                                       48

అల్ల ముల్లిలొ కల్తి,ఆవాలలో కల్తి
ఆవుపాలలో కల్తి,ఆముదములో కల్తి
కల్తి సరుకులే లేవన్న మాట కల్తి
తప్పు చెప్పడు వీరన్న తరచి చూడ
                                                        49
మించి పోయేదేమి లేనె లేకున్నను
ఆసక్తి కోసమని అంత వేగంబేల?
పోతె పొందలేని ప్రాణమ్ము గొప్పదిర!
తప్పు చెప్పడు వీరన్న తరచి చూడ
                                                       50
ఆర్జన తనదైన ఆడంబరము బోరు
కలసి వచ్చిన దైన కాస్త యోచించు
కష్టమెప్పుడైన నష్టపరచ .....నిష్టపడరు
తప్పు చెప్పడు వీరన్న తరచి చూడ.
                                                       51
కవిత లల్లిన గాని కథలు చెప్పిన గాని
ఎవడు నమ్మిన తత్వంబు వాడిదేగా
నిక్కమైన నిజము నీవె గుర్తెరగాలి
తప్పు చెప్పడు వీరన్న తరచి చూడ
                                                       52

అయ్యప్ప కైననూ అన్నమే కావాలి
పేరు అమృతమ్మె కావచ్చు గాక
దేవ దేవా కనర అన్నదత బాధ
తప్పు చెప్పడు వీరన్న తరచి చూడ
                                                        53
6.12.2015
                                                   
గురుకులాలల్లోన రాచబిడ్డలే నాడు
కలవారి కోసమే కార్పొరేటులు నేడు
కవిత లల్లిన గాని కథలు చెప్పిన గాని
ఎవడు నమ్మిన తత్వంబు వాడిదేగా
నిక్కమైన నిజము నీవె గుర్తెరగాలి
తప్పు చెప్పడు వీరన్న తరచి చూడ
                                                       52

అయ్యప్ప కైననూ అన్నమే కావాలి
పేరు అమృతమ్మె కావచ్చు గాక
దేవ దేవా కనర అన్నదత బాధ
తప్పు చెప్పడు వీరన్న తరచి చూడ
                                                        53
6.12.2015
                                                   
గురుకులాలల్లోన రాచబిడ్డలే నాడు
కలవారి కోసమే కార్పొరేటులు నేడు
ఉన్నోళ్ళ చేతిలో బంధీయైనది నీవు
తప్పు చెప్పడు వీరన్న తరచి చూడ
                                                          54
                                                     

చదువులమ్మగ వెలుగొందు శారదాంబకైన
చాంచల్య చిత్త యా లక్ష్మికైన
సామ్యవాదంబంటె చేదాయె నేమిటో!!
తప్పు చెప్పడు వీరన్న తరచి చూడ
                                                        55
నీటమునిగెను కదర సాటి జనమంత
ఏటికేల ఈ రీతి కోపమొచ్చెె
వరుణ కోపాగ్ని నెదిరించ ఎవరి తరము?
తప్పు చెప్పడు వీరన్న తరచి చూడ
                                                         56
కరువుకాటకాల తల్లడిల్లెడి నేల
చినుకుకోస మలమటించు జనము లేర
వరుణుడీరీతి వర్షించె నేమి ఇచట
తప్పు చెప్పడు వీరన్న తరచి చూడ
                                                          57
జాలిలేనోడు నిర్దయామయుడు
నిట్టనిలువున  ముంచేసె చెన్నయంత
కరుణనెరుగనోడు వరుణుడెట్లాయెరా
తప్పు చెప్పడు వీరన్న తరచి చూడ
                                                         58
మంచి నీళ్ళే లేని ఊళ్ళెన్నొ ఉండగా
మదరాసు నగరాన్ని ముంచి వేసావే
నీటముంచిన వాడ నిన్నెట్లు కొలుతురా
తప్పు చెప్పడు వీరన్న తరచి చూడ
                                                         60

పాలకల్లాడేటి పసి పిల్లలను జూసి
పాలివ్వ వచ్చిన సాటి తల్లుల జూడు
కరుణన్న దేమిటో తెలుసుకో వరుణా
తప్పు చెప్పడు వీరన్న తరచి చూడ
                                                         61
భక్తి శ్రద్ధల మునిగి సంచరించే జనులతో
గుళ్ళు గోపురాల నిలయమైనట్టి నేలలో
ఏమి తక్కువాయె నీ రీతి వర్షించ !!
తప్పు చెప్పడు వీరన్న తరచి చూడ
                                                         62
అవకాశం మూరెడాశ బారెడు
ఆశమూరెడవకాశం బారెడు
సమతుల్యత లోపిస్తే తప్పైపోదా!
తప్పు చెప్పడు వీరన్న తరచి చూడ
                                                         63
8.12.2015

కడలినెడబాసి కరిమబ్బై కురిసిందా
కూడళ్ళను ముంచేసి  తోడును మింగిందా
తనలాగే అందరంటె నీతౌతుందా
తప్పు చెప్పడు వీరన్న తరచి చూడ
                                                        64
నేను నేనైనది నీ వల్లే కదా
నీవు నీవైది నావల్లే కదా
మనమెప్పుడు ఒకరికొకరం
తప్పు చెప్పడు వీరన్న తరచి చూడ
                                                        65
పరిమళించిన పూల పులకరించిన నేల
అవతరించెను కాద బతుకమ్మ గా ఇల
జనన మంటె కాదు మనిషి పుట్టుక ఒకటె
తప్పు చెప్పడు వీరన్న తరచి చూడ
                                                           66
విప్లవించిన వీర యోధులందరు నాడు
స్వాతంత్ర్య యోధులై సమరాన దూకగా
జనియించె భారతావని ముద్దు బిడ్డలై
తప్పు చెప్పడు వీరన్న తరచి చూడ
                                                           67
జననమంటె పసి పాప గానే కాదు
అని లోన,గని లోన సమిధలై శ్రమియించ
జనియించ లేదటో బొగ్గులో బొగ్గులై
తప్పు చెప్పడు వీరన్న తరచి చూడ
                                                          68
రక్తాన్ని చెమటగా మార్చు యంత్రాలయ్యి
బువ్వ బెట్టగ నీకు బుగ్గి అవుతున్నోళ్ళు
పుట్టలేదా రైతులై పేద తండ్రులు
తప్పు చెప్పడు వీరన్న తరచి చూడ
                                                         69
కవితలంటె కాదు స్తోత్రాలు,కీర్తనలు
చల్ల కదలకుండ పాడేటి పాటలు
బతుకు జననము చూపు మంచి మాటలు గాని
తప్పు చెప్పడు వీరన్న తరచి చూడ
                                                         70
సత్కవుల్ హాలికు లైననేమని
పోతనెపుడో చెప్పె వందలేండ్ల క్రింద
రైతన్న సుఖపడిన దేనాడు లేదురా?
తప్పు చెప్పడు వీరన్న తరచి చూడ
                                                       71
మోటకొట్టిన్నాడు మురిసి పోయినోడు
మోటరొచ్చినంక ఉరిబోసు కొననేల?
విత్తనాల కల్తి వానుసురు తీసెరా!!
తప్పు చెప్పడు వీరన్న తరచి చూడ
                                                         72
నరాలు తేలి నాట్యం చేసిన
కరముల నెప్పుడు ఖాళీ గుంచక
కష్టం చేసిన నష్టం తప్పలె
తప్పు చెప్పడు వీరన్న తరచి చూడ
                                                       73
తొలకరితో ..పులకరించిన ఆశలన్నీ
మొక్క మొలవక బిక్కుమనెను
బక్కరైతూ.. ఆశలన్నీ భగ్గుమనెను
తప్పు చెప్పడు వీరన్న తరచి చూడ
                                                     74
గడ్డిమోపులు కట్టి చొప్ప గూళ్ళను వేసి
మూగజీవాలకు మేత కూడేసినా
 పుణ్యమెప్పుడు లెక్క రాయలే దేవుడు
తప్పు చెప్పడు వీరన్న తరచి చూడ
                                                      75
రైతుదేవుడన్న మాటచెప్పుడె తప్ప
పగతుమోసమె కాద ..ప్రతిచోట
పత్రిసమర్పించి ఫలమెంతొ కోరురా
తప్పు చెప్పడు వీరన్న తరచి చూడ
                                                      76
                                               
బొమ్మ బెట్టినంత భగవంతుడున్నట్ల?
కలము పట్ట గానె కవిత రాసినట్ల!
పరిథి గలిగినంత ఫలమందు కాద !!
తప్పు చెప్పడు వీరన్న తరచి చూడ
                                                      77

ఏదైనా ముదిరితే పిచ్చేకాదా
తప్పొప్పులు తెలియకుంటె తప్పైపోదా
కడుపు నిండినవాడి కవితలంతే కదా
తప్పు చెప్పడు వీరన్న తరచి చూడ
                                                     78
జయము పొందలేరు కాలము పై నెవరు
రాజైన పేదైన ఉర్వి పై నెవరైన
వాయిదాల బుద్ది మానుకుంటె మేలు
తప్పు చెప్పడు వీరన్న తరచి చూడ
                                                     79
అర్ధపర్ధం లేని వాదనలు వద్దురా
అవసరమ్మేమిటో తెలిసికో మేలగు
మాటలమ్ము "కొట్టు" కాదు మీటింగంటె
తప్పు చెప్పడు వీరన్న తరచి చూడ
                                                     80

పొగడవినవలె నని యుండు ఏరికైన
పొగిడినంత  పొగరు హెచ్చునేమోయని
వెనుకముందాడుదురేమొ విమల మతులు
తప్పు చెప్పడు వీరన్న తరచి చూడ
                                                       81

కుక్కనోట చిక్కె చెత్త కుప్పల పాప
ఏ తల్లి కష్టమో,ఏ పాపి మోహమో?
అమ్మతనానికి దూరం చేసినోడిదె పాపం
తప్పు చెప్పడు వీరన్న తరచి చూడ
                                                         82

చందస్సు బంధాలు తుంచేసు కున్నాక
కవితలను కొలవగా లెక్కలేమిటొ చెప్పు
కడుపు మంటను తూకమేయంగ తరమే
తప్పు చెప్పడు వీరన్న తరచి చూడ
                                                         83
దెబ్బ తాకినంత మూల్గేటి మూల్గుకున్
రాగముుండాలంటు రాద్దాంతమేలరా
కవితరాసే వాడి కలము కడ్డము రాకు
తప్పు చెప్పడు వీరన్న తరచి చూడ
                                                         84
తల్లి గర్భమునుండి తా బయటపడగానె
ఏడ్వవలెనని పాప కే గురువు చెప్పెరా
ఏకలవ్యుని కెవడు నేర్పెరా విద్యలు
తప్పు చెప్పడు వీరన్న తరచి చూడ
                                                        85

కమనీయ భావాల కదలాడు కలముండ
ఛందస్సు గోలేల చెల్లి ఇందిర నీకు
అనుకుంటె అందని ఫలము కాదది గూడ
తప్పు చెప్పడు వీరన్న తరచి చూడ
                                                        86
పడి పడి కి లింగంబు పడిపూజ వైనంబు
"వంగ " చేసు కున్న పుణ్య ఫలము
కృష్ణ స్వామి కళా తృష్ణ కదాఇది
తప్పు చెప్పడు వీరన్న తరచి చూడ
                                                      87
హద్దుమీరమెపుడు బుద్దిగా ఉండేము
ముద్దు లొలుకు కవిత లల్లుకుంటు
ముద్దమమందరాల మరిపాలు మావిలే
తప్పు చెప్పడు వీరన్న తరచి చూడ
                                                     88

ఇష్టమైన పనిలొ ఈదులాడుచు నుండ
సెలవంటె రోజింత పొడవాయెనేమి?
మనసు మురిసేపని చేయుటే సుఖమన్న
తప్పు చెప్పడు వీరన్న తరచి చూడ
                                                       89

అవినీతి జాతీయ మైపోయి నప్పుడు
వరము లాయెను నరులకు బాధలన్ని
భూమాత లంచంబు గా కోరె నెరువు
తప్పు చెప్పడు వీరన్న తరచి చూడ
                                                       90
గాలి మాటలు విని ఆలి నొదలినాడు
శంక లేక శంభూకు తల దునిమి నాడు
వంకలేనివాడు కా....గదొంక జెప్పువాడు
తప్పు చెప్పడు వీరన్న తరచి చూడ
                                                       91
తనవరము తానడిగె కైక దేమున్నది
శివుని విల్లు విరిచి చేసిన పాపంబు
సకల కష్టములకు కారణమౌగాని
తప్పు చెప్పడు వీరన్న తరచి చూడ
                                                        92
అష్ట భార్యలపైన ఇష్టమన్నది లేద
వదహారు వేల తో ప్రణయమాడె
హద్దన్న దే లేక రాధతో సరసాల?
తప్పు చెప్పడు వీరన్న తరచి చూడ
                                                        93
చెల్లి ముక్కు గోయ చెలరేగె రావణుడు
నాతి సీత నపహరించె నా కోపమున
హద్దులెరగని చేష్ట లంటె ఇవియే కదా!!
తప్పు చెప్పడు వీరన్న తరచి చూడ
                                                       94
తిరుచూళి లోబుట్టి తిరు చూర్ణమే దిద్ది
ఆదిదేవుని చెంత అహము నొదిలె
సన్యసించి తాను మౌని రమణుడాయె
తప్పు చెప్పడు వీరన్న తరచి చూడ
                                                      95
అరుణా చలంబతను వీడలే దేనాడు
అంత్యకాలము వరకు అదియె నావాసంబు
హద్దులెరిగిన బుద్ది శాలి రా రమణుండు
తప్పు చెప్పడు వీరన్న తరచి చూడ
                                                     96
తల్లి పార్వతి నాడు తపము చేసిందెచట
అలిగిన గణపతిని అనునయించిన దెచట
హద్దులెరిగిన రమణు డడుగు పెట్టిన దకడ
తప్పు చెప్పడు వీరన్న తరచి చూడ
                                                     97
గణపతిని తోడ్కొని అరుదెంచె షణ్ముఖుడు
బ్రతక జూపెను బతుకు దారినే భువిపైన
రమణ గణపతులవతరించి ..అరుణాద్రిపై
తప్పు చెప్పడు వీరన్న తరచి చూడ
                                                        98
మనసు మౌనమైన మనిషి మునివరుండు
అహము వేరైపోతె వాడెపో దైవంబు
అరుణ రమణుని..తత్వ మర్ధమింతేకద
తప్పు చెప్పడు వీరన్న తరచి చూడ
                                                      99
బూటకపు మాటలాడిన ...బ్రహ్మ గర్వ మనిచి
లింగరూపిగ మారె నరుణాద్రి తానయ్యి
అహము నిర్మూలించు మార్గమే తానౌను
తప్పు చెప్పడు వీరన్న తరచి చూడ
                                                    100
వేలకవుల నొక్క వేదిక పై చేర్చి
కారణమ్మయ్యిరీ వీరన్న పదము లల్ల
కృష్ణ కళా రవీంద్రుల కష్టఫలము
తప్పు చెప్పడు వీరన్న తరచి చూడ
                                                    101
కృష్ణ  స్నేహము వయసు పాతికేళ్ళు
ఒడుదొడుకులెదురైన ఓడిపోలేదెపుడు
ఓరిమి కూరిమి తురిమిన మేళవవింపు.
తప్పు చెప్పడు వీరన్న తరచి చూడ
                                                      102
 కడుపు నిండినోడి మాటలలో శాంతి
ఆకలేసినోడి వాదనలో....అశాంతి
వేరుచేసి చూడ కూడదన్నది నిజము
తప్పు చెప్పడు వీరన్న తరచి చూడ
                                                        103
ఒక్క వాదము కాదొక్క వేదము కాదు
ఎవరి వాదంబైన ..మన్నన లే పొందు
కవిసహస్రంబెపుడు కవిత పక్షమె సుమీ
తప్పు చెప్పడు వీరన్న తరచి చూడ
                                                      104
కవి సహస్రం తోడ కదిలిన భాగ్యమ్ము
పదము లల్లు ప్రతిభ కలిగె నేమొ
వంద పదములు చెప్ప వింతేమిగాదు
తప్పు చెప్పడు వీరన్న తరచి చూడ
                                                     105
జనము కోసమె ధనమైన దేవుడైన
వారిక్షేమము వాంఛించు వారె కవులు
కవిసహస్రమైన కోరున దంతేగ
తప్పు చెప్పడు వీరన్న తరచి చూడ
                                                    106
నేనను,నాదను ,అజ్ఞానపు కొలిమి రగల
కలగబోదు శాంతి ఇసుమంతైన
గీత చెప్పిన బోధ, కాదు నా హిత బోధ
తప్పు చెప్పడు వీరన్న తరచి చూడ
                   
ఒక్క వాదము కాదొక్క వేదము కాదు
ఎవరి వాదంబైన ..మన్నన లే పొందు
కవిసహస్రంబెపుడు కవిత పక్షమె సుమీ
తప్పు చెప్పడు వీరన్న తరచి చూడ
                                                      104
కవి సహస్రం తోడ కదిలిన భాగ్యమ్ము
పదము లల్లు ప్రతిభ కలిగె నేమొ
వంద పదములు చెప్ప వింతేమిగాదు
తప్పు చెప్పడు వీరన్న తరచి చూడ
                                                     105
జనము కోసమె ధనమైన దేవుడైన
వారిక్షేమము వాంఛించు వారె కవులు
కవిసహస్రమైన కోరున దంతేగ
తప్పు చెప్పడు వీరన్న తరచి చూడ
                                                    106
నేనను,నాదను ,అజ్ఞానపు కొలిమి రగల
కలగబోదు శాంతి ఇసుమంతైన
గీత చెప్పిన బోధ, కాదు నా హిత బోధ
తప్పు చెప్పడు వీరన్న తరచి చూడ
                                                    107
బతికినన్నాళ్ళు బ్రతకనీ పక్కవాన్ని
తొవ్వకెప్పుడు తోటి వాడి లోపమ్మునూ
వెయ్యేండ్లు బతకగా రాసిలేదెవరికీ
తప్పు చెప్పడు వీరన్న తరచి చూడ
                                                     108

గీతా శ్లోకం చెప్పి సెలవు తీసుకుంటా


నిర్మాణ మోహా జితసంగ దోషా
        అధ్యాత్మ నిత్యా విని వృత్త కామాః!
ద్వంద్వైర్విముక్తా స్సుఖదుఃఖ సంజ్ఞై
         ర్గఛ్చంత్యమూఢాః పద మవ్యయం తత్!

5 వ శ్లోకం 15 వ అధ్యాయం

Saturday, February 20, 2016

వీరాస్ "గణిత శతకము"



గణిత్వం.

కవితా గణితం. 12 (గణిత్వం)

మూడు కోణములను మూడు భుజములను
కలిగిన బహు భుజియె కదర త్రిభుజి
కోణములను గొలువ కొలతల మొత్తము
నూట ఎనబ యుండు నూరు బాల్లు
1
సహజ సంఖ్య లన్న సాగు నొకటినుండి
అంత మవని సమితి అందు రదియు
పూర్ణ సంఖ్య లన్న పూర్ణము తో సాగు
అపరిమితము దాని ఆన వాళ్ళు
2
సంత సమ్ము తెలియ సంఖ్యలలో గూడ
కల్పితాలు గలవు కనుము నీవు
రూటు మైనసొకటి రూటది సపరేటు
కల్పితమ్ము అదియు కఠిన నిజము
3
వ్యాసమందు సగము వ్యాసార్థ మందురు
జ్యాల లోన పెద్ద జ్యాయె నదియు
లెక్క కంద జ్యాలు లెక్కలేనన్నుండు
ఎన్ని గలవొ చెప్ప ఎఱుక లేదు
4
బీజ గణిత మనగ బిగువైన లెక్కల
బిగిని సడల జేయు బీజ మాయె
అంకగణిత మునకు అందాల నద్దులే
మరువకు గుడిపల్లి మాట నెపుడు
5
నాల్గు మూలలైన నాల్గు లంబములేను
కర్ణముల కొలతలు కదర సమము
అట్టి కొలత లలర అదియె చతురస్రము
గణితమె గుడిపల్లి గౌరవంబు
6
ఒక్క జత భుజము లొక్క దూరము నున్న
పిలవ ట్రెపిజియమ్ము పిలుచు కొమ్ము
గణిత మందమైన గణనల శాస్త్రమ్ము
గణితమె గుడిపల్లి గౌరవంబు
7
నాల్గు మూల లేమొ నాల్గు లంబము లేల
కొలవ భుజము లొక్క కొలత లైన
సమ చతుర్భుజమ్ము సాగ కర్ణమొకటి
గణితమె గుడిపల్లి గౌరవంబు
8
రెండు రెండ్లు నాల్గు ,రెండు మూడుల ఆరు
మూడు రెండ్లు ఆరె ముచ్చటగను
వరుస మార్చ విలువ వాసి మారదెపుడు
మరువకు గుడిపల్లి మాట నెపుడు
9
గీయ త్రిభుజి మూడు గీతలే అనుకోకు
మూడు కొలత లున్న ముచ్చ టౌను
ఒక్క గట్టి కొలత ఒడుపు చదరమిచ్చు
గణితమె గుడిపల్లి గౌరవంబు
10
పైథాగరస్ సిద్దాంతము

కర్ణ వర్గ మన్న కర్ణేతరమ్ముల
వర్గ ములను గూడ వచ్చు నదియు
లంబ కోణ త్రిభుజ లంబ సూత్రమ్మది
మరువకు గుడిపల్లి మాట నెపుడు
11
(సరూప త్రిభుజ వైశాల్యం)

రూప మేక మైన భుజవర్గ ములెపుడు
ప్రాంత ములను వర్గ ప్రాంత ములను
పోల్చ నొక్క తీరు పోలు త్రి భుజమందు
గణితమె గుడిపల్లి గౌరవంబు
12
కొట్ట బడదు ఎపుడు కోరి దేనితొగాని
ఒకటి కాక నదియు ఒదిగి యుండి
కారణాంక మైన కదర ప్రధానమ
మరువకు గుడిపల్లి మాట నెపుడు
13
కారణాంక ములును కాద రెండే
రెండు
ఎక్కువైన లేక ఏమి తగ్గ
కా దభేద్య సంఖ్య ఖచ్చిత ముగనది
గణితమె గుడిపల్లి గౌరవంబు
14
ఏడు హార మవ్వ ఏల నిర్వదిరెండు
వేయ "పై" విలువగు వృత్త మందు
నిజము,ఖచ్చితమ్ము నిశ్చయమ్ము గకాదు
మరువకు గుడిపల్లి మాట నెపుడు
15
అంద మైన దన్న ఔను వృత్తమె కదా
కదల కుండ కేంద్ర గాన లహరి
ఒక్క దూర ముననె ఉరికించు చుండు
గణితమె గుడిపల్లి గౌరవంబు
16
తొమ్మి దెక్క ములను తొలిగనే నేర్చినా
పదవ ఎక్క మెపుడు పనియె గాదు
మించు ఎక్క ములవి ముంచు నీ తృష్ణను
మరువకు గుడిపల్లి మాట నెపుడు
17
సరి సరి సరి యైన సరియె ఔనుకాద
బేసి బేసి కూడ బేసి రాదు
సరిని,బేసి కల్వ సరియు రా దేమిరా
గణితమె గుడిపల్లి  గౌరవంబు
18
Whole square of (a+b)
"ఏ"ను "బీ"ను కూడి ఎపుడు వర్గము చేయ
రెంటి మొత్త మంత రెండు సార్లు
విథిగ కలుప వలెను విడివర్గ ములకేను
మరువకు గుడిపల్లి మాట నెపుడు
19
Whole square of ( a-b)

ఏ"లొ "బీ"ను తీసి ఎపుడు వర్గము చేయ
రెంటి మొత్త మంత రెండు సార్లు
విథిగ తీయ వలెను విడివర్గ ములనుండి
గణితమె గుడిపల్లి గౌరవంబు
20
భిన్న భావమంటె భీతిల్ల వలదోయి
పంచు కొనుటె కాద పండు గల్లె
లవము హారమన్న లాభించు మొత్తమ్ము
మరువకు గుడిపల్లి
21
లవము లవము గల్పిలెక్కజే యవలెను
హార మొక్క టైన యపుడు,లేక
పోతె ,హార ములను పోల్చుకసాగుతో
గణితమె గుడిపల్లి గౌరవంబు
22
అకరణీయ సంఖ్య
లవము హార మెపుడు లభిత పూ ర్ణములయ్యు
శూన్య హర మసలె చూడ కున్న
అకరణీయ సంఖ్య యగునని అందురు
మరువకు గుడిపల్లి మాట నెపుడు
23
సమితి యన్న గుంపు సదవగలదులెమ్ము
చెప్ప గలిగి నపుడు మూల కములు
నిర్వ చించ లేని నింద నీపైవద్దు
గణితమె గుడిపల్లి గౌరవంబు
24
మూలకములు లేని ముచ్చ టే దైనుంటె
శూన్య సమితి యనుము సూటి గాను
ఫై"ని గుర్తు గాను ఫైసలా చేయుము
మరువకు గుడిపల్లి మాట నెపుడు
25
సమితి మూలకములు సంస్తుతి చేసిన
పరిమి తమ్ము అదియు ప్రస్తు తమ్ము
అపరి మిత సమితులు అనబడు లేనిచో
గణితమె గుడిపల్లి గౌరవంబు
26
సమితు లందు నీవు సామ్యమ్ము కనిపెట్టి
నిజము చూప నదియె నిర్మాణ రూపమ్ము
జాబితాగ రాయ జాబితా రూపమ్ము
గణితమె గుడిపల్లి గౌరవంబు
27
బిందు రేఖ తలము బింక మింకేలన్న
నిర్వచించలేని నిజము కదర
గణితమందు నవియు గణుతి కెక్క గలిగె
గణితమె గుడిపల్లి గౌరవంబు
28
భుజమును పొడిగించ భూమితో కోణమ్ము
బాహ్య మయ్యు వెలుగు బాగ సమము
అంతరాభి ముఖపు అంతర కోణాలు
గణితమె గుడిపల్లి గౌరవంబు
29
పాదములును నాల్గు పాటియై వెలుగొందు
అడ్డు నిలువు రేఖ లమరగాను
అక్ష లేఖ లెపుడు అమరు లంబములయ్యి
గణితమె గుడిపల్లి గౌరవంబు
30
రూపమేకమయ్యి రూపించు నప్పుడు
వేరు గ పరి మాణ  వెతల చూడ
పలక గను సరూప పటము లేను
31
కోణములును మూడు కొలవ సమము గుండ
మూడు భుజములును మురిసి పోవ
త్రిభుజము సమబాహు త్రిభుజమై చెలగురా
గణితమె గుడిపల్లి గౌరవంబు
32
బహుపది పరిమాణ భావన చూడగా
ఘాత మొకటి రెండు ఘనము గుండ
బహుగ రేఖ వర్గ బహుపదు లనియండ్రు
గణితమె గుడిపల్లి గౌరవంబు
33
సైను టీట యైన సైనేతరమ్మైన
కాసు ట్యాను వాటి వ్యుత్క్రమాల
అలరె ట్రిగన మెట్రి అంతయు నవియుగా
గణితమె గుడిపల్లి గౌరవంబు
34
సూత్ర మన్ననేమి సూటిగా మాటాడు
గణిత భాగ మన్న ఘనత యౌను
ఎంత వేగ మైన ఎంచిచూ డగనిచ్చు
గణితమె గుడిపల్లి గౌరవంబు
35
షరతు లున్న వన్ని శంకలేకను గన్న
మనకు లాభమేమి మరవ వద్దు
గణిత దారి తప్పి గణన చేయగ లేము
గణితమె గుడిపల్లి గౌరవంబు
36
ఏక వృత్త మందు ఏ జ్యాల నైననూ
ఒక్క పొడవు గల్గి ఒనర యున్న
కోణ మేక మౌను కేంద్రము తోడను
గణితమె గుడిపల్లి గౌరవంబు
37
నాల్గు బిందు వులను నయముగ కలిపిన
వృత్త మొక్క టైన,వృద్ది యగును
చక్రమొంటి పైన చక్రీయ బహుభుజి
గణితమె గుడిపల్లి గౌరవంబు
38
వాన రాక డెపుడు వాన పోక డెపుడు
తెలియ రెవ్వ రన్న తెలివినుండి
సంభవించు లెక్క సంభావ్య తే జెప్పు
గణితమె గుడిపల్లి గౌరవంబు
39
మార్చి స్థితి జూడ మారని ఫలితమ్ము
ప్రక్రియేది తనకు ప్రశ్న కాదు
కుదురు ధర్మ మాయె కూడస్థిత్యంతరం
గణితమె గుడిపల్లి గౌరవంబు
40
గుణన గుణిజ మన్న గుణకార భావనలు
గుణిజ లబ్ద మన్న గుణక ఫలము
వరుస మార్చ వచ్చు వకటె ఫలము
గణితమె గుడిపల్లి గౌరవంబు
41
చిన్న సంఖ్య యన్న చిత్రమే చిత్రము
ఒక్క టొకటి పెట్టు ఒకటి పక్క
ఒనర గొచ్చు నీకు ఒప్పగా చినసంఖ్య
గణితమె గుడిపల్లి గౌరవంబు
42
దూరమాన మన్న దూరాలు కొలవగా
మలచు కొన్న కొలత మనకు నేడు
పోల్చ దేని నైన పోలిక కొలతయే
గణితమె గుడిపల్లి గౌరవంబు
43
సున్న రెండు నాల్గు సూడ నారెనిమిది
అమరియుండ చూడ నదియు గూడ
పిలువ సరి సంఖ్య మిగులు బేసి యగును
గణితమె గుడిపల్లి గౌరవంబు
44
సరి బేసి లబ్ద సంఖ్య యన్నదెపుడు
సరియె యగును వేరు సరియు గాదు
బేసి బేసి గూడ బేసి సంఖ్యేగదా
గణితమె గుడిపల్లి గౌరవంబు
45
ఒకటి గాదు భేద్య ఒకటి కాదు అభేద్య
సంఖ్య యన్న నిజము సంత సించు
మిగిలి నట్టి ప్రతిది మిగులునేదోదాంట్లొ
గణితమె గుడిపల్లి గౌరవంబు
46
తత్సమాంశమన్న తనలొ కలుపు కొన్న
మార్పు నొంద కుండ మాది రగును
కలుప తీయ మార్పు కనదది సున్నతొ
గణితమె గుడిపల్లి గౌరవంబు
47
తత్సమాంశమన్న తనరు సున్న మరియు
ఒకటి గూడ నట్లె ఒప్పు గాను
మొదట కూడ పిదప మోదమై గుణియించ
గణితమె గుడిపల్లి గౌరవంబు
48
అన్ని అంకె లచట అన్య మెరుగకకల్పి
కొట్ట గలిగి నపుడు కోరి మూడు
కారణాంక మయ్యి కలిసిపోవును గదా
గణితమె గుడిపల్లి గౌరవంబు
49
చివర సున్న ఉన్న చివర నైదున్ననూ
చూడ సులభ మవ్వు చూడగాను
చెప్ప వచ్చు నైదు కార ణమ్ము
గణితమె గుడిపల్లి గౌరవంబు
50
మూడు రెండు లున్ను ముచ్చటై భాగించ
ఆరు కారణాంక మలర గాను
మూడు రెండు గూడ ముందుగ భాగించు
గణితమె గుడిపల్లి గౌరవంబు
51
కడకు సున్న యున్న కారణంగాపది
లెక్క తప్ప దెపుడు లెస్స గాను
ఐదు రెండు గూడ ఐచ్చిక గుణకాలె
గణితమె గుడిపల్లి గౌరవంబు
52
సరి బేసి స్థాన సంకలన భేదమ్ము
పదున కొండు చేత పంచ బడిన
పదున కొండు దాని పడిపడి భాగించు
గణితమె గుడిపల్లి గౌరవంబు
53
రేఖీయ ద్వయ స్వీకృతం

రేఖ పైన బిందు రేఖతో జేసిన
కోణములను కూడ కొత్త గుండు
కొలవ నదియు నపుడు కోటికి పెట్టింపు
గణితమె గుడిపల్లి గౌరవంబు
54
సంకలించి నపుడు సంకలన ధర్మము
వ్యవ కలన మందు వ్యక్త మైన
వ్యవహ రించ బడును వ్యవకల్న ధర్మమై
గణితమె గుడిపల్లి గౌరవంబు
55
సంఖ్య చివరి రెంటి సంఖ్యను నాల్గది
నాల్గు భాగములుగ నదియు జేయ
కాద నాల్గు దాని కారణాంకము జూడ
గణితమె గుడిపల్లి గౌరవంబు
56
సంఖ్య చివరి మూడి సంఖ్యను ఎనిమిది
సక్కగ విడగొట్టి సవర జేయ
ఎనిమి దప్పుడచట నెరుగ భాగించు
గణితమె గుడిపల్లి గౌరవంబు
57
అంక మూల మింక అంతయు తొమ్మిది
భాగములవ నచట బాగు గాను
కాద తొమ్మి దింక కారణాం కము దెల్వ
గణితమె గుడిపల్లి గౌరవంబు
58
వెసగ పొడవు నెత్తు వెడల్పుల లబ్దంబు
ఘనఫలమ్ము యగును ఘనము గాను
దీర్ఘ ఘనము కొలత ధీరత చూడరా
గణితమె గుడిపల్లి గౌరవంబు
59
భూ పరిథిని ఎత్తు భూరిగ గుణియించ
పట్టకముల నెపుడు పరగ జూడ
వేగ ప్రక్క తలము వైశాల్య మొచ్చులే
గణితమె గుడిపల్లి గౌరవంబు
60
ఎట్టి పట్ట కమ్ము ఎత్తువైశాల్యమ్ము
లబ్ద మెంచ దాని ఘన ఫలమ్ము
అట్లు పరిగ ణించి ఆచరించ వలెను
గణితమె గుడిపల్లి గౌరవంబు
61
ప్రక్క తలము నకును ప్రక్క భూముల కల్ప
పూర్ణ తలము లెక్క పూర్తి యవగ
పూర్ణ తలము యొక్క పూర్తి వైశాల్యమ్ము
గణితమె గుడిపల్లి గౌరవంబు
62
సౌష్ఠ వాక్షరములు సౌష్ఠ వాక్షములతొ
పదియు పైన రెండు పరగ గలవు
అట్టి ఆంగ్ల భాష అక్షరములనుజెప్పు
గణితమె గుడిపల్లి గౌరవంబు
63
సౌష్ఠవాక్షములను సౌజన్య శీలివై
లెక్క బెట్టి చూడు లెక్క తేల్చు
పరగ చదరమునకు పట్టఎన్నున్నవి
గణితమె గుడిపల్లి గౌరవంబు
64
ఎట్ల మల్చి చూడ ఎన్నగ సమమౌను
వృత్త మెట్లు నాడు వృద్ది యయ్యె
సక్క బెట్ట వృత్త సౌష్ఠవాక్షములెన్ని
గణితమె గుడిపల్లి గౌరవంబు
65
భూమి యొకటి యైన భూమిఘాతములను
కూడి ఘాత ములను కూర్చ గాను
మార్పు లేని భూమి మనకు ఫలితమ్ము
గణితమె గుడిపల్లి గౌరవంబు
66
రాశి బంధ మేయ రాశుల లెక్కించి
అంత స్సూత్ర మేదొ అందజేయ
సాధనలను మనకు సాధించు దారియౌ
గణితమె గుడిపల్లి గౌరవంబు
67
అసలు వడ్డి కాల లబ్దంబు కనుగొని
వంద భాగ మెంతొ వంతు వేయ
బారు వడ్డి గణన బాగుగా జేయొచ్చు
గణితమె గుడిపల్లి గౌరవంబు
68
వర్గ సంఖ్య యేమి వరుస బేసిలరాసి
పరగ తీయ వచ్చు ఫలిత మెంత
చివర మిగులు సున్న చిత్రమేమిటిచూడు
గణితమె గుడిపల్లి గౌరవంబు
69
మూడు నాల్గు ఐదు ముచ్చట గానీవు
ఎన్ని రెట్లు వేయ ఎక్కు వేమి
పరగ త్రికము లున్ను పైథాగరస్ పేర
గణితమె గుడిపల్లి గౌరవంబు
70
ఘనమూల మనగ ఘనపు సంఖ్య నెపుడు
భేద్య మవని గుణక భేద్య మెంచి
మూటనొక్క టొచ్చు ముడిసిన లబ్దంబు
గణితమె గుడిపల్లి గౌరవంబు
71
ఏక వ్యాస మున్న ఏ శంఖు స్థూపము
గోళమున్ను ఎత్తు గూడ సమమె
ఘనము లొకటి మూడు, ఘనమగు నాలుగు
గణితమె గుడిపల్లి ఘనత యగును
72
ఒకటి రెండు పాల్లు ఒనరగ విభజించు
నట్లు బిందువున్న నయముగాను
త్రిగుణముల దెలుప త్రిథాకరణమదియు
గణితమె గుడిపల్లి ఘనత యగును
73
మొదటి వాని సగము మొదటనె రాయాలి
మిగిలి నట్టి వాని మిగుల గలిపి
సగము జేసి రాయ సరిమధ్య బిందువౌ
గణితమె గుడిపల్లి ఘనత యగును
74
వై ల భేద మెంతొ వైనముగాజూసి
ఎక్సు భేద మెంతొ ఎన్న జూసి
వాటి భాగ హార వాడియె వాలౌను
గణితమె గుడిపల్లి ఘనత యగును
75
(థేల్స్ సిద్దాంతం)
భుజ సమాంత రమ్ము భుజముల నెప్పుడు
మిగులు భుజము లనది మిక్కు టముగ
విభజ నేక రీతి విభజించు త్రిభుజిలో
గణితమె గుడిపల్లి ఘనత యగును
76
గోడ కేసి నట్టి గోడునిచ్చెన జూడ
లంబ త్రిభుజి నందు లావు గాను
కర్ణ మన్న రీతి కానిపించును గదా
గణితమె గుడిపల్లి ఘనత యగును
77
ఆకరమ్ము నొకటి అరయగా పరిమాణ
యేక మవక నున్న యేమి ఫలము
సర్వ సమము కాదు సారూప్య మౌగాని
గణితమె గుడిపల్లి ఘనత యగును
78
సమితి మూలకములు సరిగ రాయగ నీవు
జాబి తాల నెపుడు జాడ చూడ
ఏది గూడ తిరిగి ఎపుడు రాయగవద్దు
గణితమె గుడిపల్లి ఘనత యగును
79
సున్న సున్న నేల సూటిగా భాగించ
చూడలేము ఎపుడు చూడబోము
అర్ధమవని దికద అట్టి విషయ మేను
గణితమె గుడిపల్లి ఘనత యగును
80
సున్న తోడ సంఖ్య సూటిగ గుణియించ
సున్న లబ్ద మన్న సుందరమ్ము
గణన గుణక ములలొ గణితమె గదనోయి
గణితమె గుడిపల్లి ఘనత యగును
81
శూన్య మైన నేమి శూన్యేతర మవనీ
లబ్ద మెపుడు నీకు లభ్య మవగ
సున్న తోడ జేయ సున్నాయె వచ్చురా
గణితమె గుడిపల్లి ఘనత యగును
82
గుణక మింక నీకు గుణిజము కాబోదు
కారణాంక మదియు ఖచ్చితముగ
ఎన్ని రెట్లొ తెల్పు ఎక్కమే యౌగాని
గణితమె గుడిపల్లి ఘనత యగును
83
సంఖ్య లన్ని సర్ది సరదాగ రేఖపై
చూప నగును మనకు జూడ తగును
కుడి ఎడమల దిశలు కూడ జూపు నవియు
గణితమె గుడిపల్లి ఘనత యగును
84
కలప వచ్చి నట్టి కొలత తొంబది యైన
అవియు నెపుడు గూడ నరయ సరిగ
పూర కములు కోణ పూరకములవియు
గణితమె గుడిపల్లి ఘనత యగును
85
వేద గణితమన్న వేగముగా లెక్క
చేయ గలుగు నట్టి చేవ నిచ్చు
స్వామి చూపి నట్టి స్వాగత గణితము
గణితమె గుడిపల్లి ఘనత యగును
86
చిట్టి పొట్టి గాను చిత్రమై కన్పించు
సాధనలను స్వామి సాధ్య పరచె
వేదగణిత మనిన వేదాంత మనికాదు
గణితమె గుడిపల్లి ఘనత యగును
87
వేదగణిత మన్న వేదాలలోనున్న
గణిత సారమదియు ఘనము గాను
భారతావని కిల భాగ్యమై వెలుగొందు
గణితమె గుడిపల్లి ఘనత యగును
88
వర్గ ఘన మూల వాదనలను తాను
మూల ప్రక్రియలంటు ముదము తోడ
మొదలు నేర్వ మనకు మోదము చేకూర్చు
గణితమె గుడిపల్లి ఘనత యగును
89
సృష్టి లోన నేది సృష్టించ బడలేదు
నాశనమ్ము కాదు నాదరూప
గణిత శాస్త్ర మిచ్చు ఘనమైన సత్యమ్ము
గణితమె గుడిపల్లి ఘనత యగును
90
భూమి లెక్క లరయ భూజనుల్ మదిలోన
వేసి నట్టి లెక్క వేగిరమ్ము
రేఖ లెన్నొ వేయ  రేఖాగణితమాయె
గణితమె గుడిపల్లి ఘనత యగును
91
సూక్ష్మ పద్దతులను సూచించె వేదాలు
గణిత సరళి  నిలుప గగనమందు
భవ్య మైన దృష్టి భారతీ తీర్థది
గణితమె గుడిపల్లి ఘనత యగును
92
చక్ర భ్రమణ మునట చక్కగా పరికించి
చేసిరి సమ భాగ ఛేదనమ్ము
నాల్గు లంబము లని నాకువు సూత్రమ్ము
గణితమె గుడిపల్లి ఘనత యగును
నాకువు=పుట్టుట
93
కాలము పని యన్న కాల దూరము లన్న
కలత చెంద వలదు ఘనత బొంద
నిజమది అనుపాత నిష్పత్తి భావనే
గణితమె గుడిపల్లి ఘనత యగును
94
ఒకటి రెండు మూడు ఒనరగ నాలుగు
ఇటుల వేస్తు వరుస ఇరువ దేయ
ఇరువ దిరువ దొకటి ఇంటు జేయ సగము
గణితమె గుడిపల్లి ఘనత యగును
95
నాల్గు పాదములని నయముగ విభజించ
తలము పైన గీత తలపులేగ
జరప మారు పాద జగము వింతేమిటో
గణితమె గుడిపల్లి ఘనత యగును
96
త్రిభుజ శీర్ష ములను త్రికరణ శుద్దిగా
కేంద్ర భాస మన్న కేవ లమ్ము
ఎక్సు వైల కొలత  ఎంతయో సరిజేయ
గణితమె గుడిపల్లి ఘనత యగును

97
సరి ప్రధాన సంఖ్య సరసము గారెండు
ఉన్న దొక్క టేను ఉన్న నిజము
మూడు తోడ సాగు మిగిలిన వన్నియు
గణితమె గుడిపల్లి ఘనత యగును
98
వంద లోపు గలవు వంక బెట్టగ లేము
ఇరువ దైదు అన్న ఇట్టి నిజము
ముందు సంఖ్య వంద ముందు మూడడుగుల్లొ
గణితమె గుడిపల్లి ఘనత యగును
99
పూర్ణ సంఖ్య నెపుడు పూర్ణ సంఖ్య తొ గూడ
పూర్ణ సంఖ్య వచ్చు పూర్ణ మవగ
సంవృ తమ్ము ధర్మ సంకటమేలేదు
గణితమె గుడిపల్లి ఘనత యగును
100
వినుము గుర్తు మార్చ విలోమ మౌగదా
అకరణీయ సంఖ్య అక్కజముగ
పరగ సంక లనము పరిణితి లిడగాను
గణితమె గుడిపల్లి ఘనత యగును
101
ఒకటి మొదలు గున్న ఒప్పారు సహజాల
మొత్త మెంత యన్న ,చివరి సంఖ్య
దాని ఉత్త రముల లబ్ద సగమగులే
గణితమె గుడిపల్లి ఘనత యగును
102
బహుముఖి ఫలకముల బహువస్తు వులు ఏవి
ఘనము దీర్ఘ ఘనము ఘనము గాను
పట్టకమ్ము మరియు పాటిగా పిరమిడే
గణితమె గుడిపల్లి ఘనత యగును
103
వలగ రూప మేయ వలసిన రూపమ్ము
పేర్చ వచ్చు లెమ్ము పేర్మి మీర
ఊహ గొప్ప గున్న ఊతమిచ్చునుగాద
గణితమె గుడిపల్లి ఘనత యగును
104
జ్యామితీయ పటము జ్యాని లేకుండగా
సరళ సంవృ తమ్ము సకల మవగ
మూడు భాగ ములుగ ముడచగ వీలగు
గణితమె గుడిపల్లి ఘనత యగును
105
చాపము కొస లెంత చాకచక్యమ్ముగా
అర్ధ వ్యాస ములచె అలరి నపుడు
త్రిపుర వృత్త మందు త్రిజ్యాంత రమ్మురా
గణితమె గుడిపల్లి ఘనత యగును
106
సౌష్ఠ వాక్ష మన్న సౌష్ఠవ పటముకు
అడ్డు గీత గాద నక్క జముగ
ఒక్క తీరు భాగ మొప్పారు ప్రతిరూపు
గణితమె గుడిపల్లి ఘనత యగును
107
సాంఖ్య శాస్త్ర గరిమ సాధన తోసరి
భాగ హార మొచ్చు భాగ్య మున్న
పద్ద తన్న దేమి పరిశీలనే చాలు
గణితమె గుడిపల్లి ఘనత యగును
108
విడిగ పొడవు గొల్వ వీభాగి నీ స్కేలు
వృత్త లేఖిని నున్న వృత్త మొచ్చు
కోణమాని యున్న కోణములనుగొల్తు
గణితమె గుడిపల్లి ఘనత యగును
109
వృత్త గోళ మన్న చదర ఘనము లన్న
చక్క నైన జతలు చదువ గాను
దీ.చ.దీ.ఘ లున్ను దీని బోలు నవియె
గణితమె గుడిపల్లి ఘనత యగును
110
సుందరమ్ము గణిత సుస్వరాలాపన
గణిత టీచరన్న గాద కీర్తి
గణిత మెరిగి నోడె ఘనుడుగా వెలుగొందు
గణితమె గుడిపల్లి ఘనత యగును
111


వీరా "భావవల్లరి" 2 అద్వితీయము


 గుడిపల్లి వీరారెడ్డి
ప్రభుత్వ ఉపాద్యాయులు



🌺🌺🌺🌺🌺

శివం
నీల కంఠుని వదలక నిత్య మెపుడు
మదిని తలచుచు నుండిన మంచి జరుగు
సత్య మెరిగియు వర్తిల్ల సంతసమ్ము
చిత్త లూరున నెలకొన్న చిద్విలాస
1
పుట్టె తిరుచూళి పట్టణం పుణ్య మేమొ
సుంద రలగమ్మల సుతుడై సుంద రముగ
భువిని కాల్మోపె రమణుడే  భూసు రుడుగ
భక్తి కర్థంబు తెలుపగా భవ్య ముగను
2
కలిసి దేహము తోనె తా కలిసి పోయి
ఇద్దరొకటన్న తలపోత ఇట్టు లయ్యె
క్షీణ అక్షీణ భావమ్ము క్షీణ మవ్వ
బంధ మనుగూడు లోతాను బంధి యయ్యె
3
నిన్ను తలవని రోజున నిజము గానె
ప్రియము గానేను శ్వాసను పీల్చ లేను
నిన్ను మరచిన క్షణమున నిజము గానె
నిలవ లేనులె భూమి పై నిక్కముగను
4
చావు పుట్టుక లన్నవి చక్క గాను
చేతిలో లేని విషయమే చెప్పగాను
నడుమ నున్నట్టి కాలమే నవ్వు కుంటు
జీవికను సాగ దీయుటే జీవితమ్ము
5
చావ వలసిన క్షణమొస్తె చచ్చి నట్టు
నీదు పాదాల చెంతనే నిక్క ముగను
నిలుతు నిను చేర హాయిగా నిజము సుమ్మి
పుట్టు చోటికి వెల్తున్న పులకరమున
6
సిగ్న లున్నను నియమాలు సితము వదలి
ఎగర జూచెడు వారికి ఎదురు నిలిచి
మందలించియు మార్గము నెఱుక పరచు
రక్షక భటులార మాపాలి రక్ష మీరు
7
నిమిష మాలస్య మాయెనా నీకు ఎపుడు
ఎందరున్నను ఫలమేమి ఎక్కడైన
రోడ్డు జామని అంతట రోదనేగ
రక్షక భటులార మాపాలి రక్ష మీరె
8
ప్రాణ మన్నది మీదేన ప్రాజ్ఞులార
ప్రాణముగ జూచు మీ పాలి ప్రాణు లెన్ని
ఎదురు జూచుచు నున్నారొ ఎఱుగ లేవ
ఎందుకావేగ మెందుకు ఎందు కొఱకు
9
నాల్గు దిక్కులు వదలక నవ్య మేది
ఎరుగ లేవేమి రోజంత ,ఎంత మాత్ర
మీవు విశ్రాంతి తెలియని విజయు డవగ
తిన్న గుందువు నీ కేమి తెలియ నట్లు
10
మనసు గెలవగ కోరుకో మనిషి లాగ
మనిషి నే గెల్వ కోరకు మనసు లేక
మనిషి మనసుల బంధమే మమత యౌను
వినర గుడిపల్లి మాటను వివర మెఱుగ
11
పరుల మనసును గెలుచుట పాడి గాని
తప్పు లెంచుట ఎప్పుడు తగదు చూడ
తప్పు లెంచెడి గుణమున్న తప్ప కుండ
ఒరుల బాధించి సాధించి ఓడిపోవు
12
తెలిసి అడుగుట తప్పని తెలియలేవ
తప్పు లెంచుట లో తృప్తి తప్పు కాద
ఎదుటి వారిని నొప్పించ ఎపుడు గూడ
సాహసించకు సోదరా సత్య మరసి
13
మంచి చెడు లేమిటో చెప్పు మంచి మనసు
మంచి మనసేమిటో చెప్పు మంచి చెడులు
మంచి చెడులెెంచు వారెపో మందమతులు
సహజ గుణమది వీరన్న సాగ నివ్వు
14
పరుల పొగడకున్న పాపిష్టి నోరండ్రు
ఒట్టి మాట కాదు ఒప్పు జూడ
పొగడ నెఱుగ కున్న పోగాల మంతేగ
పలుకులు గుడిపల్లి పలికె నిట్లు
15

సీస పద్యం

భాగ్య నగర ప్రజ భావి నేతగ నీకు
              భద్ర మైన గెలుపు భాగ్య మిచ్చె

ఎదురు లేక గులాబి ఎన్నికల్లో గెల్చి
               గతమున లేనట్టి ఘనత దెచ్చె

భారీ మెజారిటీ భాగ్యము నీదవ్వ
                ఓటరందరి నేమొ ఓడగొట్టె

అంబర మంటేను ఆనందమే నేడు
                అందరి హృదయాలు అద్భుతముగ

ఆ.వె

వేరు రాష్ట్ర మున్న వెతలుండ వనిజెప్పి
మనకు రాష్ట్ర మొచ్చు మార్గ మందు
నడిపి తెచ్చి నావు నవ్య రాష్ట్రమ్మేను
జనత మెచ్చి నట్టి జన్మ నీది
16
ఆ.వె

నమ్మి నోల్ల నెపుడు నట్టేట ముంచలే
మరవ లేదు నీదు మాట నెపుడు
కోత లెరుగ మెపుడు కోరినట్టి కరెంటు
భాగ్య నగరి నేలు భాగ్య దాత
17
కం.ఏ పిలుపూ కదిలించని
ఈ పిలుపున దాగె నేమొ ఈప్సిత మేదో?
నీ పిలుపే మేలు కొలుపు
ఆ పిలుపే నాకు నేడు అందెను శంభో!!
18 
కం.తొలి పొద్దు పొడుపు ముడతలు
మలి పొద్దు సొగసు విరుపులు మరువగ తరమా?
వలిమల పైనే కాదుర 
కలగంటి తనపెదవొంపు కదలిక రూపున్
19
కొండ శిఖరాన ఒక మఱ్ఱి కొమ్మ పైన
సిద్ద రూపము థరించి సిధ్దు డిగను
అరుణ శివుడుండు ననినమ్మి అతను కదలి
కంది రీగల దాడిలో కంది పోయె
20
కంది రీగల గూల్లను కాల్లతోటి
తాకి కూల్చిన ఫలితమ్ము తాను నమ్మి
కోరె క్షమాపణలు వాటి కోప మెరిగి
పోవ తానింక వెనుదిర్గి పోయె గాద
21
మళ్ళ జన్మంటు ఉండునా? మల్లి పుట్ట?
సాధ్య మగునని నమ్మడం సత్య మేన?
రమణ సారమ్ము తెలిపిన రమ్య బోధ
అదియు అజ్ఞాన మన్నదే అతని మాట
22 
అన్ని తెలిసిన వాడెవ్వ రవని మీద
ఏమి తెలియని వాడెవ్వ డెచట గలడు
తెలిసి తెలియని వారేగ తెలివి జూప
వాగు తుందురు వీరన్న వాగ నివ్వు
23
సీ.
సీసము రాయగ శ్రీఘ్రము గా నేను
              గణ యతు లన్నింటి గణన నేర్చి
విరిసినట్టి గులాబి విరగబూ సినరీతి
             పాద పాద మునందు పంచ గాను
సంబరాలను జూసి సంతసించిన వారు
               పద్య పాదములను పాడు కుంటు
ఒప్పు కోలుగ జూసి ఒప్పారు సంతోష
                సంబరమ్ముకు నేను సంత సిస్తి
ఆ.వె
దీక్ష పట్టి సాగి దీక్షగా సాధించి
యజ్ఞ యాగ ములను యాగి చేయ
మాట జార కుండ మంచిజేసి యు జూపె
రాష్ట్ర ప్రగతి కొఱకు రాజ సముగ
24

ఇమడలే మనితెల్సి ఇంటివా డవలేని
             ఇక్కట్లు భరియించి ఈద గాను
కల్కటే రుకొలువు కాదుగా వదిలేసి
               తనకు నచ్చినరీతి తాను మెలగ
వలదన్న రాలేక వదల వదేలనో
                లాభమే లేకున్న లాస్య మేల?
చేయ పనులులేవ చేవగల్గిననీకు
               నిందనేల పరుల నింద సేయ

ఎవరు నిన్ను పిలిచి ఏమని అడిగారు
నీకు నీవె చేరు నిజము గాద
ప్రతి పనికి మనము ప్రభుతను నిందించ 
పాటి యేన మీకు ప్రశ్న వేయ
25
పద్య మన్నది వదిలి పంతులన్నది మర్చి
                    కవితనొదిలి నేను కలత చెంది
మాటమరిచి పోయి మారాము చేయక
                     మందలింపెరుగని  మనిషి నైతి
ఉద్యమ గీతాలు ఉధృతముగ రాసి
                    రాష్ట్ర మేర్పడగానె రాత లాపి
ఊరుకున్నపుడేమొ ఉచిత హైకని జెప్పి
                    కృష్ణ మోహను డొచ్చిగ్రూపు నిచ్చె

మంచి మితృలనిచ్చిన మంచి మనిషి
మధుర మైనది జీవితం మళ్లి మొదలు
కవిత ఝల్లులు మొదలాయె కళలు మారె
నిత్య కళ్యాణ మైపాయె. నిజము సుమ్మి
26
వరుస గలిపి మాట వదిలేటి ఇందిర
                కవిమితృ లందరి కామె అక్క
అన్న పానీయాలు అన్నియు వదిలేసి
                  కవితలు రాసేటి కవియె ఏ.వి
అరుణ భ్రమర లన్న అభిమాన మేకద
                  ఎవరికైన నిటను ఎంత గానొ
అమరవాది యు నేడు అందరి కభిమాన
                    పాతృడైన కవియు పాటి గాను

సల్ల అంబటి అంజన్న సల్ల గుండ
మేక రవి వాసిరెడ్డి ల  వాసి యొప్ప
కృష్ణ మోహన్ కళా చందృ కృప తోడ
సంక ట ములేక సాగెడు సైని కులము
27

భూమికి గాయాలు భూరిగ జేశారు
                   బోరు బా వులపేర పోట్లు పొడిచి
లోతుల్ల నీరంత లోపాల మయమాయె
                   ఫ్లోటింగు లేదాయె ఫ్లోరి నుండె
వనము లన్ని నరికి వర్షమ్ము లేకుండె
                   చెఱువు లెండగనేమొ చేటు వచ్చె
కఱువు కాటకముల కాలమా సన్నమై
                   కలియుగమ్మను పేర కాటు వేసె

సహజ సిద్దాంత మొదిలేసి సాగు తున్న
మానవాళికి లేదు మనుగ డింక
ఆశకే హద్దు లున్నచో అనవరతము
ప్రకృతి నియమాలు పాటించ ప్రాభవమ్ము
28

కోపమెందు కరుణ కొత్త మాటది చూడ
                 ఆప్త మితృలు మీరు అంద రున్ను
కవి మితృలందరు కాద ఆత్మీయులు
                  కవనమల్ల కలత ,కలత జెందు
అబ్బురమ్ము మనకు అంత కలిసి యుండ
                   ఎందుకు కోపాలు ఎవరి కొఱకు
ఎందరున్నను కాని ఏమి జేసిన గాని
                మీతోటి స్నేహమే మేధ మగిడి

కవన మల్లెడు మనమంత గర్వ పడగ
కలిసి నట్టిది ఈ గ్రూపు కడలి లాగ
కలుపు కొని నిల్చు కడదాక కల్ల గాదు
వదిలి పోనెప్పు డీ గ్రూపు వదల లేను
29
ఒక్క పూట బడులు ఒద్దందు రదియేల
                    పసివారి శిక్షించ పాడి గాదు
తల్లడిల్లుదురయ్య తప్పదు ఎండలో
                     వడలి పోదురు కాద బాల లంత
పంతుల్ల కేమైన పనిచెప్ప జూసిన
                    పాడియగును కొంత ఫలిత ముండు
పసిపిల్ల లేకదా పంతమేల మనకు
                  బలవంతముగ నేల బడులు నడుప

చిన్న పిల్లలు ఎండలో చిక్కి పోయి
తల్ల డిల్లుదురుకాద తథ్య ముగను
మొదలు పెట్టిరి మనవారు మొదటి నుండి
ఒక్క పూటే బడి నడుప ఒద్దికనియు
30
పది మంది లోనున్న పరిమళించెడి వాడు
                  ముద్ద మందారాల ముద్దు ఱేడు
వరుకోలు పిలగాడు వరుసగా స్పందించు
                 వదలక నెవరిని వద్దికగను
కవిత లల్లెడు వారి కవనమ్ము పరికించి
               విలువైన సలహాలు విశద పరచు
తను కళా చంద్రుడు తలపైన టోపితో
          సతతము చిరునవ్వు చిందు చుండు

ఎవరి నెపుడు బాధించి ఎఱుగనట్టి
శాంతరూపి కళా చంద్ర శాంతముగను
అందుకో శుభకామన లందు కొమ్ము
పుట్టిన దినము ఈనాడు పూర్ణ చంద్ర
31
అక్క చెల్లెలనగ అలక పూనగ వలె
           ఆడపడుచులన్న అలగ వలెను
ఓదార్చ బూనెడు ఓర్పు కలిగినోల్లు
           అన్నదమ్ము లుకాద! అవని మీద
బ్రతిమి లాడుట యన్న బ్రతుకులో సుఖమురా
             అందాల బంధమ్ము అదియె లెమ్ము
మాట పట్టింపు తో మాటాడ కుండిన
             తోబుట్టు కన్నీరు తూడ్చు నెవరు?

అలక లోదార్పు లెరుగని అడ్డ మైన
బ్రతుకు బ్రతుకగ సుఖమేమి భ్రాంతి గాని
చెల్లి అలుకను తీర్చని చేత గాని
అన్న గా జీవితము నేను ఆశ పడను
32

బ్రతుకు తదుపరి తా బ్రతుకగ వచ్చును
          మరు జన్మ కాకున్న మంచి పనియె
తననింక దానమ్ము  తానె చేసు కొనెడు
           భాగ్యమ్ము కలిగెను భాసు రముగ
అన్న దానము కన్న అవయవ దానమే
             మిన్న యై వెలుగొందు మింటి సాక్షి
శిబి రాజు మించిన శిబి చక్రవర్తులై
            ధరణి పై వెలుగొందు ధర్మ మిదియె

ఒడలు కోసియు ఒరులకు ఒసిగి బ్రతుకు
దాన గుణమున్న మనుజుల ధరణి మనది
వినుము గుడిపల్లి కవనమ్ము వీను లార
చిత్త లూరున నెలకొన్న చిద్విలాస
33
ఎన్ని నేర్పినవమ్మ ఎన్ని చెప్పి నవమ్మ
           ఎంత చెప్పిన కూడ ఎక్కువవదు
ఒంటరి తనమన్న ఒట్టి మాటే యౌను
           చేత నీ వున్నచో చేతనమ్ము
పుస్తకమవ్నచో పూర్ణ జ్ఞానము సుమీ
             మస్త కమ్మునకది మంచి మేత
నీ వున్న చాలమ్మ నీ కంటె నా కేమి
              ఎక్కువ కాదమ్మ ఎప్పు డైన

పుస్తకము నొదిలి బ్రతుక పూర్ణ సుఖము
పొంద లేమది నిజము లే పొందికగను
వినుము గుడిపల్లి కవనమ్ము వీను లార
చిత్త లూరున నెలకొన్న చిద్విలాస
34
తనసీటు లోగూడ తాను కూర్చోబోని
                  బస్సు కండక్టరు బాధ లేమి?
అడుగు నంతవరకు ఆలకించరు చూడ
                      కోరి టికెటడగ కోపమొచ్చు
వెనక కెల్లమనిన వెఱ్ఱి కోపము వచ్చు
                     బాటలో నిలబడి బాధ పెట్టు
సగము టి కెటుఅంటు సర్దిజెప్ప గనుజూచు
              వయసు తక్కు వజెప్పు వంక బెట్టు

మహిళ నిలబడ్డ చూతురు మారు మాట
పలక బోరు ,కండక్టరు పలుక రించ
వెతల బతుకాయె మాటల వేల మాయె
బస్సు కండక్టరంటెనే బాధలాయె
35
కోర నీకు కఱువ కోర్కెలు దీర్చగ
               కొబ్బరి చిప్పల గోల ఏల
నైవేద్య ములు ఏల? నైక శృంగా నీకు
          న్యాయమా లంచమ్ము నాశ పడగ
ఫలిత మాశించు యు ఫలమును ఇచ్చేటి
               ఖల దూర నీకెట్లు ఖ్యాతి వచ్చె
ఏలనే ప్రార్ధించి ఎందు కడగ వలె
             ఏమి కావలె నాకు ఎరుగ లేవ?

సకల సౌభాగ్యముల నివ్వ శాంతి నివ్వ
పూజ లవసరమన్న ఈ పుడమి నవ్వు
వినుము గుడిపల్లి కవనమ్ము వీను లార
చిత్త లూరున నెలకొన్న చిద్విలాస
36
బస్సు నిండుగ జనమున్న భయము లేక
వెనుక కెనుకకు నెట్టేసి వేగి రమ్ము
టికెటు ఇచ్చేసి యస్సారు డ్యూటి చేయు
బస్సు కండక్టరంటేను భక్తి నాకు
37
విన్న వినకున్న నవ్వుతూ విసుగు పడక
బస్సు నింపెడు డ్యూటీని భార మనక
ఆప మన్నంత నే బస్సు ఆపు నట్టి
బస్సు కండక్టరంటేను భక్తి నాకు
38
చిన్న టికెటుకు నోటివ్వ చిల్ల రిచ్చు
తాను నిలబడి సీటిచ్చు తల్లులకును
విసుగు చెందక నవ్వెడు విషయ మున్న
బస్సు కండక్టరంటేను భక్తి నాకు
39
పద్మ మరణించి నప్పుడు...13.02.2016

రామ బుద్ధుని ఇంట రాజిల్లె పత్నిగా
         పద్మ యనెడు పేర పరమ సాధ్వి
సాగెను దాంపత్య సౌరభమ్మే నాడు
           ఒడుదొడుకులు లేక ఒక్క తీరు
ఆలు మగలనిన అట్లుండ వలెనని
           అందరనుకొనగ అనవ రతము
కన్ను కుట్టిన విథియె కనుమరుగేచేసె
         పద్మను తన వెంట పట్టు కెల్లి

ఎప్పు డనికాదు చెప్పలే మెవరి కైన
ఎదురు కానున్న ఘటనయె యేల బాధ
ఒంటరైనట్టి రామన్న ఓర్చు కొమ్ము
వెంట మేమంత ఉన్నాము వెతలు మాన్ప
40
భ్రమర నాదమ్ము వినగాను భ్రమసె నేమొ
చెట్టు పుట్టలు సహితము చెప్ప గాను
ఆది వారము పిలిచెను ఆమె నవియు
ఫాము హౌజులో కొలువయ్యి ఫలము బొంద
41
కొత్త కవితలు వనములో కొదవ లేక
కోట్ల కొలదిగ లభియించు కోర్కె దీర
శారదాంబకు లోటేమి శ్రావ్యమైన
కంఠ స్వరము! . తోడుగా..కవిత లల్లు
42
                   డ్రైవర్(14.02.2016)

పయన మాతని దినచర్య పట్టు విడక
పొద్దు కెనిమిది గంటలు పోరు జేయు
ఆలు పిల్లలు ఇంటిలో ఆతురతగ
ఎదురు చూతురు తనరాక కెంత గానొ
43
బస్సు లోనున్న జనమంత భయము లేక
నిన్ను నమ్మియు నిదురోవు నిక్కముగను
మనసు లో వారు హాయిగా మరచి పోక
చేర గమ్యంబు మ్రొక్కేను చేత
43
బస్సు లోనున్న జనమంత భయము లేక
నిన్ను నమ్మియు నిదురోవు నిక్కముగను
మనసు లో వారు హాయిగా మరచి పోక
చేర గమ్యంబు మ్రొక్కేను చేతు లెత్తి
44
ఆ.వె
బస్సు చక్ర మనగ భవిత నీకిచ్చెడు
భవ్య చక్ర మదియు భాగ్య దాత
పయన మన్న నీకు భారమవ దెపుడు
నిత్య కృత్య మాయె నిక్క ముగను
45
బస్సు చక్రము ప్రగతికి మార్గ మన్న
ప్రగతి నీవల్లె సాధ్యము ప్రతిన జేతు
డ్రైవరనువాడు జనులను డ్రైవు చేయు
నాయకుని కంటె ఘనుడని నాదు మాట
46
పార్థసారథి గారి జన్మదిన కందాలు
(14.02.2016)
[2/14, 9:02 PM] వీరా గుడిపల్లి: [2/14, 8:54 PM] వీరా గుడిపల్లి: 
నాయుడు గారూ దండం
నాయుడు గారూ నిజమది నాయకులేలే
నాయుడు వనముల ప్రియులే
నాయకు లేగద జగతికి నమ్మర వీరా
47
వనము ల దహించ లేదే!
వనమిత్రుడివీవు నిజము వక్కా ణించన్
వన రక్షకుడి గ నీవే
వనదహనుడు పార్థుమించు వాడివి సుమ్మీ
48
[2/14, 9:01 PM] వీరా గుడిపల్లి: పార్థసారథి నాయుడు గారికి జన్మదిన శుభాకాంక్షలు
[2/14, 9:10 PM] వీరా గుడిపల్లి: 
సారథి నీ నామ మైనది
సారము నీ మది న నింకి సఫలం బాయెన్
సారథి పార్థును గాయగ
సారమె రిగివన ముగాచె సారథి శంభో
49
[2/14, 9:13 PM] వీరా గుడిపల్లి: పార్థసారథి నాయుడు గారికి అమకితమీ...ఆశువులు

మూసీ....నది(15.02.2016)

ఈదులాడిన తాను ఈప్సిత మీడేర
       మూసి యావల నున్న ముగ్ద గలిసె
కాలు బెట్టగలేని కాలుష్య భూతమ్ము
         కబళించె మూసీని కదర నేడు
బంగారు మనసున్న భాగమతియు నాడు
           ముచికుంద అందాల మురిసిపోయె
పట్న వాసపు నీడ పడగక్రిందీనాడు
         మురికి కూపమ్మాయె మూసి యంత

ప్రేమ తీరాల అలరారి ప్రేమ పంచి
భాగ్య నగరమ్ము పేరుతో భాగ్యమిచ్చి
మనిషి మరుగుజ్జు కోర్కెల మంట కలిసి
మూసు కొని పోయె "నాళా" గ మూసి నేడు
50
భాను తేజుడు అడిగిన భాగ్యమేమొ?
గుండె నిండుగ నిండిన గుబులు నంత
హైదరాబాదు కథలాగ హైకు లోన
తల్చుకోగల్గు చున్నాను తన్మ యమున
51
Family outing
వారాంత ములలోన వాత్సల్య ములబెంచ
           అందరొక్కటి అయ్యి అటకునటకు
తీరికగానుండి తీరుబాటుగ వెల్లి
               మనవారి తోడనే మాటగల్ప
పతియు పిల్లలునంత ప్రత్యక్షముగ గల్సి
             ఊసులు కలబోయ ఊరడిల్ల
మనసులెంతొ మురియు మాత్సర్యములు తగ్గు
               బందము బలపడి బాధ తొలగు

కలసి యుండుట లోననే కలదు సుఖము
ఒకరికొకరుగ తోడున్న ఓర్పు పెరుగు
వారమునకొక్కసారైన వదలకుండ
కలిసి ఉండాలి రోజంత కలత లొదిలి
52
శివం
నీల కంఠుని వదలక నిత్య మెపుడు
మదిని తలచుచు నుండిన మంచి జరుగు
సత్య మెరిగియు వర్తిల్ల సంతసమ్ము
చిత్త లూరున నెలకొన్న చిద్విలాస
53
విశ్వ మంతయు గోళమే విబుధులార
గోళమే లింగ రూపమ్ము గోప్యమేల?
శివుని రూపమే విశ్వమ్ము చిత్ర ముగను
చిత్త లూరున నెలకొన్న చిద్విలాస
54
నిత్య రక్షణ నీవన్న నిజము మరచి
అన్య మార్గాలు వెతికేటి అల్పు లంత
చిత్త మందున నిను గొల్వ చింతలేల?
చిత్త లూరున నెలకొన్న చిద్విలాస
55
అత్తమ్మ

అత్త యనిన నాకు అత్యంత గౌరవం
ఆలి నిచ్చి నట్టి ఆప్తు రాలు
అమ్మ వంటి దమ్మ. అత్తమ్మ అని యన్న
తప్పు కాదు ఎపుడు తనకు మొక్క
56
భాను గారి నడుగు బహుబాగ చెప్పేను
అత్త ఐన లేక అమ్మ ఐన
భాను తేజు కలము బలమైన పదునుతో
సాగు తుంది చూడు సాటి లేక
57
అత్త కాదు తాను అమ్మన్నదేనిజం
పెద్ద కొడుకు వలెను ప్రేమ జూపు
అంత గౌర వంబు ఆమెకు మనమివ్వ
తప్పు కాదు వీర! తరచి చూడ
58
అత్త కొక్క రోజు అన్యాయ మంటాను
అన్ని తానై నిలిచి ఆదరించు
మాతృ మూర్తి నెపుడు మర్యాద చేయుట
తప్పు కాదు వీర! తరచి చూడ
59
ఆమె

కలము పట్టి నేను కలలు కనెడు వేళ
కనుల ముందర తాను కన్పించు నేమి?
మనసు తనవెంట పరుగెత్తు మర్మ మేమొ
వినదు గుడిపల్లి మాటను విస్మ యముగ
60
ఆమె నవ్విన చాలుగా ఆస్తు లేల?
ఆమె చూసిన చాలుగా అన్య మేల!
ఆమె కనుచూపు సోకిన ఆంక్షలొదులు
వినదు గుడిపల్లి మాటను విస్మ యముగ
61
సూర్యుడు(16.02.2016)

వెలుగును ఇచ్చెడి వేల్పునాదిత్యుడే
                ఆకాశమందుండి అవని పైకి
నిలువెల్ల గాలుచు నిత్యమూ దగ్దమై
                ధరణి జీవంబైన దాతతాను
నిత్య సంచారిగా నిలకడ లేనట్టి
             కాలగణనలవెన్క కారణమ్ము
సప్త వర్ణపు కాంతి సతతము విరజిమ్ము
              సప్తాశ్వ రథమందు సంచరించు

అలుపు లేకుండ తిరుగుతూ అవని యంత
వెలుగు రేఖలు పరచెడి వేేల్పు తాను
వినుము గుడిపల్లి మాటను వీను లార
చిత్త లూరున నెలకొన్న చిద్విలాస
62
చిన్నెలు తెలియగ వశమా!
వన్నెలు పలు పలు విధములు వర్ణించంగన్
వెన్నెల చంద్రుని కిచ్చియు
ఇన్నెల ఇలకిచ్చి నట్టి ఇనుడిగ శంభో!!
63
రాశులు పన్నెండు రాసిన ధర్మంబు
           ఆకసంబున తాను అనవరతము
కక్ష్య వీడని వాడు కాలు నిలుపలేడు
            సమవర్తి అతనేగ సమయ ఱేడు
సప్త వర్ణములను సమ్మిళితముచేసి
            ధవళ కాంతిని తాను ధరణి పైకి
ప్రసరించి గాయును ప్రాణుల నెప్పుడు
             పట్టింపు లెరుగని పరమ స్రష్ట

చలన మాపని ధర్మంబు చలనశీలి
అగ్ని గోళంబు ! ధరణికి అంతతానె
వినుము గుడిపల్లి కవనమ్ము వీను లార
చిత్త లూరున నెలకొన్న చిద్విలాస
64
మూర్తి birthday(17.02.2016)

లెక్క లేతప్ప అన్యమ్ము లెక్క లేని
గణిత గగనాన వెలుగొందు ఘనుడొకండు
పుడమి పై మూర్తి యనుపేర పుట్టినాడు
వినుము గుడిపల్లి కవనమ్ము వీను లార
65
కొత్త లెక్క లెన్నొ కొత్తగా సృష్టించి
గణిత విలువ పెంచె ఘనము గాను
చిక్కు లెన్ని యున్న చింత లేకను తాను
తర్క మెఱుక సేయు తప్పు లేక
66
                   మేడారం.  (17.02.2016)

కాకతీయుల తోని కదనమ్ము సల్పియు
         మన్య వీరులుగాను మమత పంచి
సామంత ప్రభువుల సత్తాను ఎలుగెత్తి
          చాటిన ధీమంత చతురతదియు
జనము లోనే పుట్టి జనముకై జీవించి
          జనతనే దీవించ జగము లోన
వనదేవతలుగాను వనమందు వెలిసెను
          సమ్మక్క తోడుగా సారళమ్మ

పన్ను కట్టగ లేకను పస్తు లున్న
పట్టనటువంటి ప్రభువుల పట్టి కూల్చ
తల్లు లిద్దరు పడినట్టి తపన చూడు
చిత్త లూరున నెలకొన్న చిద్విలాస
67
అగ్ని గోళము బ్రద్దలై ఐచ్చికముగ
విస్త రించెను విశ్వమే విబుధు లార
విశ్వ మంతయు ఒకటన్న వింత కాదు
తప్పు చెప్పడు వీరన్న తరచి చూడ
68
సాగర మధనంబు సమయాన చంద్రుడు
                లక్షణముగ  బుట్ట లక్ష్మి తోడ
తల్లి తోబుట్టువు తనమేన మామని
              విశ్వ మానవ జాతి విశ్వ సించె
మేఘాల తేరుపై మేనమామైవచ్చి
           మానవాళికి మేలు మమత పంచె
అందరి బంధువై అలరారు చంద్రుడు
            వెలుగు దారుల జూపు వెన్నె లిచ్చె

రాత్రి వేళల మనకు రక్షణివ్వ
నింగి నున్నాడు చుక్కల నీడలోన
వెలుగు దారులు చూపించ వెలుగు చున్న
చందమామయ్య మనమామ చక్కనయ్య
69
కన్న పేగు తుంచ కఠినమైన మనసు
కాదు కాదు కాదు కాదు నాది
మోస గించ పడితి మోసకారినొదలి
నన్ను నింద సేయ ఏలవేర!!
70
గ్లాసు చాయ గత్కి గ్లాసును పడవేసి
పడతి నొదలి ఫోను పట్టు కొనియు
గంట గంట అంటు గంటలు గడపగ
జ్యోతి మౌన మయ్యె జ్యోతి కృష్ణ
71
బడిని గుడిగ మలచి బహుచక్కగానీవు
కవిత నల్లి నావు కాద నేడు
వంద కవిత లల్లి వందన మర్పించె 
బ్రతుకు విలువ తెలిపె భ్రమర కవిత
72
పద్య మరసి తాను పరిపరి విధముల
కథలు చెప్ప బట్టె కవన మల్లె
భార్య భర్త లట్ల భాగ్యము గా నున్న
మనము కవిత లల్లు మాట కల్ల
73. 
(సెల్ ఫోన్.19.02.2016)

శాస్త్ర మిచ్చిన గొప్ప శస్త్రము కదనీకు
           దూరాలు తగ్గించు దూర శ్రవణి
సాగదీయకు నీవు సైలెంటు కిల్లరే
          సెల్లు ఫోనన్నది సెప్ప తరమె
ఇల్లొల్లు గుల్లగు ఇంగితమును లేక
         ఇష్టమొచ్చినట్టు ఇగురు బెట్ట
అఖిల విశ్వమునంత అర చేత చూపించు
           మాయదర్పణ మది మంచిగున్న

రాముడెరుగడయ్య రాయలెరుగడయ్య
వారి కాల మందు వాస్తవముగ
మనకు కలిగె భాగ్య మానందముగనింక
వినుముర గుడిపల్లి వివర మిచ్చె
74
నోకియా స్యామ్సంగు నోటిఫై చేయగా
            సెల్కాను ఫోనులు సెటిలు ఆయె
అందకుండానుండె ఆపిలు ధరలేమొ
              ఐపాడు ట్యాబులు అదర గొట్టె
మోటుకాదుర వాడ మోటరోలా ఫోను
             మోటుగా వాడినా మోద మేను
కంపనీ ఏదైన కవిమిత్రు లందరూ
             హైకు వాట్సపు లుంటె హాయి పొందు

విశ్వ మంత ఒక్క విలువైన గ్రామమై
చెంత నున్న తీరు చెలగు చుండె
సెల్లు ఫోను తోనె సేదదీరుచు నుండె
వినుముర గుడిపల్లి విన్నపంబు

75(ఏవీ photo comments)
నోకియా స్యామ్సంగు నోటిఫై చేయగా
            సెల్కాను ఫోనులు సెటిలు ఆయె
అందకుండానుండె ఆపిలు ధరలేమొ
              ఐపాడు ట్యాబులు అదర గొట్టె
మోటుకాదుర వాడ మోటరోలా ఫోను
             మోటుగా వాడినా మోద మేను
కంపనీ ఏదైన కవిమిత్రు లందరూ
             హైకు వాట్సపు లుంటె హాయి పొందు

విశ్వ మంత ఒక్క విలువైన గ్రామమై
చెంత నున్న తీరు చెలగు చుండె
సెల్లు ఫోను తోనె సేదదీరుచు నుండె
వినుముర గుడిపల్లి విన్నపంబు
75(ఏవీ photo comments)

తలుపు మూసినాడు అతను తత్వ మరసి
సూటి తూపుల తోడనే పయన మాయె
జేబు లోనచేతుల మర్మ మేమొ గాని
అర్ధ మవదాతనిదిచూపు అతను ఏవి
76
ఏవి తాను చూడ ఎంత మం చిగనుండు
నమ్మ వద్దు సెల్లు చేతు లోన
పలుక రించి చూడు పద్యంబు చెప్పును
పలుక రించ కున్న పదము లల్లు
77
కలత లేల మనకు కలసి ఉండగమేలు
కంటి పాప వంటి కమల ములను
వీడ బోము మేము వినుడు నిజమదింక
అమ్మ లార మీది హైకు గ్రూపు
78

చెఱువు
వరద కాల్వల కడ్డుగ కట్టలేయ
చెఱువు నిండుగ నీరేమి చేరదాయె
బతుకు బరువాయె నేడింక భయము పెరిగె
తప్పు చెప్పడు వీరన్న తరచి చూడ
79
చెఱువు పూడ్చేసి ప్లాట్లుగా చేసినాక
పంట భూములు ప్లాట్లుగా మారినాక
తిండి గింజల తిప్పలు తప్ప వేమొ?
తప్పు చెప్పడు వీరన్న తరచి చూడ
80
నీటి కొఱత నేడు మిజమైన బాధాయె
వేల ఫీట్ల లోతు వెల్లి పాయె
చెఱువు లేక నీరు చెంతనుండ గబోదు
తప్పు చెప్ప వీర తరము కాదు
81
పాడి పంట కలుగు పచ్చని పొలమున్న
చెట్లు పెంచ వచ్చు చెఱువు లోన
చెఱువు నింపు కున్న చేరవు కష్టాలు
తప్పు చెప్ప వీర తరము కాదు
82
అలుగు బోయు చెఱువు అందమేమనిచెప్ప
కమత మంత నింప కంటి కింపు
ఉల్ల ముల్ల సిల్లు ఊరుసంతస మందు
తప్పు చెప్ప వీర తరము కాదు
83
ఊర డించు చెఱువు నూరు మింగినదంటె
ఊరి నెవడు గాచు నుర్వి లోన
ప్లాట్లు మింగగలవ ?ప్రాణమ్ము నిల్వగా?
తప్పు చెప్ప వీర తరము గాదు
84
చెఱువు లేని ఊరు చెప్పలేమెక్కడా!
ఊరు లేని చెఱువు ఉండు గాని
ఊరు చెఱువు లన్న ఉన్నత మగు జంట
తప్పు చెప్ప వీర తరము కాదు
85
నీటి మడుగు కాదు నీరున్న చెఱువన్న
పుడమి గర్భ మంత పూర్తి గాను
నీటి తోడ నింపు నిర్మల గంగది
తప్పు చెప్ప వీర తరము గాదు
86
చుక్క చుక్క నీరు చక్కగా చేరేసి
ఒక్క చోట చేర్చ ఒప్పు గాను
వరము లిచ్చు చెఱువు వనదేవతలవోలె
తప్పు చెప్ప వీర తరము గాదు
87
అమ్మ కృప యేల కఱువాయె అవని మీద
కట్ట మైసమ్మ కాపుగా గాయుచున్న
చెఱువు కీనాడు ఈరీతి చెఱుపు. కలిగె
తప్పు చెప్పడు వీరన్న తరచి చూడ
88
తేలు ఇటుకల రామప్ప తేటయైన
చెఱువు మనపాలి సంద్రమ్ము చెంతనుంది
కాకతీయులు ఇచ్చిన కానుకేను
తప్పు చెప్పడు వీరన్న తరచి చూడ
89
ఆడగా లక్నవరమొక్క ఆటవెలది
తేలు ఇటుకల రామప్ప తేటగీతి
ఉదయ సంద్రమ్ము మనపాలి ఉత్పలమ్ము
తప్పు చెప్పడు వీరన్న తరచి చూడ
90
జలధి లేనట్టి తెలగాణ జయము కొఱకు
ఊరుకొక చెర్వు తవ్వించి ఊతమిచ్చి
తీర్చి దిద్దారు గ్రామాల తీరు మార్చ
తప్పు చెప్పడు వీరన్న తరచి చూడ
91
కఱువు రక్కసి కోరలు కత్తిరించ
నదుల నీటిని మళ్లించి నవ్య రీతి
చెఱువులను నింపు మార్గమ్ము చెప్పినారు
తప్పు చెప్పడు వీరన్న తరచి చూడ
92
చెఱువు నీటిలో చేపలు చేరి నపుడు
ఊత తీసుకు కదిలిన ఊసులన్ని
కవనమై మారె మదిలోని కథలు అన్ని
తప్పు చెప్పడు వీరన్న తరచి చూడ
93
తూము నీటిలో తానాలు తూర్పు వైపు
పడమటున్నట్టి కాల్వలో పడిన పాట్లు
మరపు రావన్న నిజమును మనవి జేతు
తప్పు చెప్పడు వీరన్న తరచి చూడ
94
దంటగాల్లతో దండుగా దాడిచేసి
చెఱువు కట్ట పై ఈదుల ఈత పండ్ల
గుత్తులను కోసి మాగేసి గుర్తు లేస్తి
తప్పు చెప్పడు వీరన్న తరచి చూడ
95
కల్లు సాకలు పోసేటి సమయ మందు
కోట మైసమ్మ కే మొక్కి కోన్ని కోసి
చెలిమి చేసిన స్థలమది చెఱువు కట్ట
తప్పు చెప్పడు వీరన్న తరచి చూడ
96
తాటి పండ్లేరి కాల్చిన తావులన్ని
చెఱువు కొమ్మున నున్నవే చెప్పగాను
చెఱువు గుర్తొస్తె మనసంత చెలిమె లాయె 
తప్పు చెప్పడు వీరన్న తరచి చూడ
97
చెఱువు తోడిదె జీవితం చెప్పగాను
ఆడి పాడిన రోజులు అన్ని అచటె
జ్ఞాపకాలన్ని చూడగా జ్ఞానమాయె
తప్పు చెప్పడు వీరన్న తరచి చూడ
98
మాన వాళికి భాషయే మారు రూపు
మాతృభాషన్న గౌరవం మాకు ఎపుడు
అన్య భాషల దూషించు ఆట లేల?
తప్పు చెప్పడు వీరన్న తరచి చూడ
99
మాతృ భాషను నింపుకో మనసు నిండ
పొగడ వలెనన్న ఎంతైన పొగడ వచ్చు
నాగరికమౌన! దూషించ నాంగ్లభాష
తప్పు చెప్పడు వీరన్న తరచి చూడ
100
అన్య భాషలు నేర్చిన అవని పైన
మనసది వికాస మందును మరవనేల?
మాతృ భాషన్న మమకార మంతమవదు
తప్పు చెప్పడు వీరన్న తరచి చూడ
101